IOCL Recruitment: డిప్లొమా, బీటెక్ అర్హతతో ఇండియన్ ఆయిల్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థ వివిధ రిఫైనరీ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థ వివిధ రిఫైనరీ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 106 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఎగ్జిక్యూటివ్ లెవెల్-1 (96), ఎగ్జిక్యూటివ్ లెవెల్-2 (10) ఖాళీలు ఉన్నాయి.
* ఎంపికైన వారు బరౌని, గుజరాత్, హాల్దియా, పానిపట్, దిగ్బోయి, పారాదీప్ రిఫైనరీ యూనిట్స్‌లో విధులు నిర్వార్తించాల్సి ఉంటుంది.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిప్లొమా, బీఈ/ బీటెక్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 28-02-2023 నాటికి ఎగ్జిక్యూటివ్ లెవల్ 1 పోస్టులకు 35 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్ లెవల్ 2 పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తు ఫీజుగా రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 22-03-2023 చివరి తేదీగా నిర్ణయించారు.
* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..