AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jobs In IRCON: ఇంజనీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఇండియన్‌ రైల్వేలో ఉద్యాగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

Jobs In IRCON: ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తోన్న అభ్యర్థులకు ఇండియన్‌ రైల్వేస్‌ శుభవార్త తెలిపింది. ఇంజనీరింగ్‌ డిగ్రీలో పలు బ్రాంచ్‌లో విద్యనభ్యసించిన వారికి ఇండియన్‌ రైల్వే కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ..

Jobs In IRCON: ఇంజనీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఇండియన్‌ రైల్వేలో ఉద్యాగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Jobs In Ircon
Narender Vaitla
|

Updated on: Apr 09, 2021 | 2:07 PM

Share

Jobs In IRCON: ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తోన్న అభ్యర్థులకు ఇండియన్‌ రైల్వేస్‌ శుభవార్త తెలిపింది. ఇంజనీరింగ్‌ డిగ్రీలో పలు బ్రాంచ్‌లో విద్యనభ్యసించిన వారికి ఇండియన్‌ రైల్వే కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (IRCON)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు మే 18లోగా అప్లై చేసుకోవాలని సూచించారు. వర్క్స్‌ ఇంజనీరింగ్‌/సివిల్‌, వర్క్స్‌ ఇంజనీర్‌/ఎస్‌ అండ్‌ టీ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇంతకీ ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు ఏ బ్రాంచ్‌లో ఇంజనీరింగ్‌ చేసి ఉండాలి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖ్యమైన విషయాలు..

* ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 74 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. * వర్క్స్‌ ఇంజనీరింగ్‌/సివిల్‌: ఈ విభాగంలో 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. * వర్క్స్‌ ఇంజనీర్‌/ఎస్‌ అండ్‌ టీ: ఈ పోస్టుకు అప్లై చేసుకోవాలనుకునే వారు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థి ఆయా కోర్సుల్లో 60 శాతం మార్కులు పొంది ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థలోనే ఆయా కోర్సులు పూర్తి చేసి ఉండాలి. ఇక ఈ విభాగంలో 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * పై పోస్టులకు అప్లై చేసే ఉద్యోగులకు ఏడాది అనుభవం ఉండాలి.

ఇలా అప్లై చేసుకోండి..

ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇందుకోసం తాజా ఫొటోతో పాటు సంతకాన్ని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇక మీ ఎక్స్‌పీరియన్స్‌కు సంబంధించిన సర్టిఫికేట్‌ను అప్‌లోడ్‌ చేయాలి. ఆన్‌లైన్‌లో అప్లై చేశాక ప్రింట్‌ కాపీని.. DGM/HRM, Ircon International Ltd, C-4, District Centre, Saket, New Delhi 110017 చిరునామాకు ఈ నెల 28లోగా అందేలా పోస్టులో పంపించాల్సి ఉంటుంది.

Also Read: Pearl Farming: సాప్ట్ వేర్ జాబ్ వదిలి చెరువులో ముత్యాలు పండిస్తూ.. లక్షలను ఆర్జిస్తున్న యువకుడు ఎక్కడంటే..!

Cancel Board Exams 2021: మా పరీక్షలు రద్దు చేయండి… సీబీఎస్ఈ పరీక్షలపై లక్ష మంది విద్యార్థుల పిటిషన్..

Kendriya Vidyalaya Admissions 2021: మొదలైన 2వ తరగతి అడ్మిషన్లు.. కీలక ప్రకటన జారీ చేసిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్