AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancel Board Exams 2021: మా పరీక్షలు రద్దు చేయండి… సీబీఎస్ఈ పరీక్షలపై లక్ష మంది విద్యార్థుల పిటిషన్..

పెరుగుతున్న కరోనా కేసుల్ని దృష్టిలో ఉంచుకుని CBSE 10, 12వ తరగతి వార్షిక పరీక్షలు రద్దు చేయాలంటున్నారు విద్యార్థులు. కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా మే నెలలో జరగబోయే బోర్డు పరీక్షలు రద్దు చేయాలని, లేదా వాటిని ఆన్‌లైన్‌లో నిర్వహించాలని కేంద్రాన్ని కోరుతూ స్టూడెంట్స్..

Cancel Board Exams 2021: మా పరీక్షలు రద్దు చేయండి... సీబీఎస్ఈ పరీక్షలపై లక్ష మంది విద్యార్థుల పిటిషన్..
Cbse Students
Sanjay Kasula
|

Updated on: Apr 08, 2021 | 10:47 PM

Share

పరీక్షలు పెట్టండి బాబు ! అంటూ ధర్నాలు… ఆందోళనలు చేయండం ఇంత కాలం చూసాం.. ఇప్పుడు కొంత ట్రెండ్ మారింది. మా పరీక్షలు రద్దు చేయండీ… పరీక్షలు లేకుండానే పాస్ చేయండీ..! అంటూ విన్నపాలు మొదలు పెట్టారు నేటి తరం విద్యార్థులు. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు కేంద్ర విద్యా శాఖను కోరుతున్నారు.

పెరుగుతున్న కరోనా కేసుల్ని దృష్టిలో ఉంచుకుని CBSE 10, 12వ తరగతి వార్షిక పరీక్షలు రద్దు చేయాలంటున్నారు విద్యార్థులు. కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా మే నెలలో జరగబోయే బోర్డు పరీక్షలు రద్దు చేయాలని, లేదా వాటిని ఆన్‌లైన్‌లో నిర్వహించాలని కేంద్రాన్ని కోరుతూ స్టూడెంట్స్ ఆన్‌లైన్‌లో పిటిషన్ పెట్టారు. దాదాపు లక్షమందికి పైగా విద్యార్థులు ఆన్‌లైన్‌ పిటిషన్‌పై సంతకాలు చేశారు.

రెండు రోజుల నుంచి క్యాన్సిల్ బోర్డ్ ఎగ్జామ్స్ 2021 పేరుతో ఉన్న హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. గతేడాది తక్కువ కేసులు ఉన్నప్పుడే పరీక్షలు రద్దు చేశారు. ఇప్పుడు కేసులు పీక్‌లో ఉన్నాయి. ఈ ఏడాది జరగబోయే వార్షిక పరీక్షలను రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రిని కోరుతున్నాం. ఇప్పటికే విద్యార్థులమంతా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాం అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన సీబీఎస్‌ఈ.. విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. విద్యార్థుల భద్రత కోసం పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే పరీక్షా కేంద్రాలను కూడా 40 నుంచి 50శాతం పెంచాం.

నిబంధనలు పాటించేలా సిబ్బందికి ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నాం ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం వార్షిక పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. మే నెలలో జరగబోయే బోర్డు పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థుల నుంచి డిమాండ్ పెరుగుతోంది.   వాటిని ఆన్‌లైన్లో నిర్వహించాలని సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు సుమారు లక్ష మందికిపైగా విద్యార్థులు ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారు. అంతేగాక, #cancelboardexams2021 అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు.

పరీక్షలపై అసత్య ప్రచారాలు చేయొద్దు..

షెడ్యూల్ ప్రకారమే వార్షిక పరీక్షలు యథావిధిగా జరుగుతాయని సీబీఎస్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ గెర్రీ అరాథూన్ కూడా స్పష్టం చేశారు. ఎవరూ ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దన్నారు. దీంతో మే 4 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు జరగనున్నాయి. కాగా, కరోనా కారణంగా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి: Alert Wi-Fi: పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా..? వాడుకుని బ్యాకింగ్ ట్రాన్సక్షన్స్ చేస్తున్నారా? అయితే బీ అలర్ట్..!

COVID-19 Confirmed: ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానంటూ ట్వీట్..