Igno Admissions 2021: ఆన్‌లైన్ కోర్సుల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించిన ఇగ్నో.. ఎలా అప్లై చేయాలో తెలుసా..
IGNOU 2021 Registration For Online Courses: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) ఆన్‌లైన్ విధానంలో 16 ఆన్‌లైన్ కోర్సులకు రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. భారతదేశంలో నివసిస్తున్న
IGNOU 2021 Registration For Online Courses: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) ఆన్‌లైన్ విధానంలో 16 ఆన్‌లైన్ కోర్సులకు రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. భారతదేశంలో నివసిస్తున్న సార్క్, ఇతర విదేశీ విద్యార్థులు (ఎఫ్‌ఎస్‌ఆర్‌ఐ), సార్క్ కాని దేశాల నుంచి వచ్చిన విదేశీ విద్యార్థులందరూ ఈ కోర్సులకు నమోదు చేసుకోవచ్చని చెలిపింది. విదేశీ విద్యార్థులు ఈ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి.. ఇగ్లో అదికార వెబ్ సైట్ ignou.ac.inకు వెళ్లాలి.
డిప్లొమా మరియు సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లతో పాటు మాస్టర్స్, బ్యాచిలర్ల స్థాయిలో మొత్తం 16 ఆన్‌లైన్ కోర్సులు విదేశీ విద్యార్థులకు అందించనుంది. ఇగ్నో ఆన్‌లైన్ ప్రోగ్రామర్‌లలో విద్యార్థులకు 24 గంటల ఆన్‌లైన్ ద్వారా హెల్ప్ చేయనుంది. ఇందులో ఉపన్యాసాలు, పుస్తకాల పీడీఎఫ్ విద్యార్థులకు సులభంగా అందుబాటులో ఉంటాయి.
రిజిస్ట్రేషన్ విధానం.. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఇగ్నో 2021 రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుగా వారి క్యాలిఫికేషన్ను చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ ఫారమ్‌ను పూర్తిచేయడానికి కొన్ని స్టేప్స్ ఫాలో కావాలి.
* IGNOU- ignou.ac.in యొక్క అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. * హోమ్‌పేజీలో, విదేశీ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ ప్రోగ్రామ్ ప్రవేశం కోసం లింక్‌పై క్లిక్ చేయండి. * క్రొత్త పేజీలో రిజిస్ట్రేషన్ టాబ్ పై క్లిక్ చేయండి. * వివరాలను నమోదు చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. * ఇప్పుడు రిజిస్టర్డ్ ఐడి, మొబైల్ నంబర్‌కు పంపిన ఆధారాలతో లాగిన్ అవ్వండి. * పూర్తి ఫారమ్ నింపిన తర్వాత పేర్కొన్న పత్రాలను అప్‌లోడ్ చేయండి. * ఫారమ్ నింపిన తరువాత, దరఖాస్తు ఫీజు చెల్లించి, ఫారమ్ను సమర్పించండి.
ఇగ్నో 2021 దరఖాస్తు ఫారంతో పాటు, అభ్యర్థులు కొన్ని పత్రాలు స్కాన్ చేసిన కాపీలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అవి.. ఫోటోగ్రాఫ్, సంతకం, వయస్సు రుజువు, సంబంధిత విద్యా అర్హత, పాస్‌పోర్ట్, వీసా, స్టడీ వీసా పౌరసత్వ కార్డు, నేషనాలిటీ, భారతదేశంలో నివాస రుజువు ,OCI / PIO / UNHCR శరణార్థి కార్డు పత్రాలను సమర్పించాలి.