Kendriya Vidyalaya Admissions 2021: మొదలైన 2వ తరగతి అడ్మిషన్లు.. కీలక ప్రకటన జారీ చేసిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్

2021-22 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించింది కేంద్రీయ విద్యాలయ సంఘటన్. 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు 2021 ఏప్రిల్ 8(గురువారం) నుంచి ఏప్రిల్ 15 వరకు జరగనున్నాయి. ఇందు కోసం అడ్మిషన్స్...

Kendriya Vidyalaya Admissions 2021: మొదలైన 2వ తరగతి అడ్మిషన్లు.. కీలక ప్రకటన జారీ చేసిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్
Kendriya Vidyalaya Class 2
Follow us

|

Updated on: Apr 08, 2021 | 9:30 PM

KVS 2nd Class Admissions 2021 Registration Begins: 2021-22 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించింది కేంద్రీయ విద్యాలయ సంఘటన్. 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు 2021 ఏప్రిల్ 8 (గురువారం) నుంచి ఏప్రిల్ 15 వరకు జరగనున్నాయి. ఇందు కోసం అడ్మిషన్స్ మొదలైంది. ఈ అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అధికారిక వెబ్‌సైట్లో kvsonlineadmission.kvs.gov.in. చూడవచ్చని తెలిపింది. అధికారిక సమాచారం కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఈ వెబ్‌సైట్ మాత్రమే ఫాలో కావాలి. అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. kvsonlineadmission.kvs.gov.in. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లో కూడా దరఖాస్తు చేయొచ్చు. 1వ తరగతిలో అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2021 ఏప్రిల్ 1న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.

Offline Admission Process for Class 2 Students: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. గురువారం(08-04-2021) అధికారిక నోటిఫికేషన్‌లో ఈ వివరాలను తెలిపింది. ప్రకటనలో తెలిపిన ప్రకారం.. కేవీఎస్ 2వ తరగతి ప్రవేశ ప్రక్రియ 2021 ఆఫ్‌లైన్ మోడ్‌లో జరుగుతోంది. అంటే, తల్లిదండ్రులు/సంరక్షకులు సంబంధిత కేంద్రీయ విద్యాలయాన్ని (KVS) వెళ్లి అప్లై చేసుకోవాలని కోరింది. స్కూల్‌కు వెళ్లి దరఖాస్తు ఫారమ్ పొందాలని కోరింది. దేశ వ్యాప్తంగా ఉన్న కేవీ నిర్దిష్ట తరగతిలో అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య ఆధారంగా రెండవ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ల జరుగుతున్నాయని వెల్లడించింది. 2 వ తరగతి చేరిన విద్యార్థుల జాబితాను 2021 ఏప్రిల్ 19 న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు.

KVS Admission 2021 for 2nd Class – Important Dates: దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంతో తల్లిదండ్రులు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) ప్రవేశం 2021 యొక్క ముఖ్యమైన తేదీలను ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. అలా చేయడంలో వారికి సహాయపడటానికి, వివరణాత్మక పట్టిక అన్ని ముఖ్యమైన ప్రవేశ సంఘటనలు మరియు వాటి తేదీలను తెలియజేస్తుంది క్రింద ఇవ్వబడింది:

Admission Event Date / Deadline
Registrations Begin 8th April 2021
Registrations End 15th April 2021
Admission Process Begins 20th April 2021
Admission Process Ends 27th April 2021

ఇవి కూడా చదవండి : PM Modi Video Conference: దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. సీఎంలకు దిశా నిర్దేశం చేసిన ప్రధాని మోదీ..

 Alert Wi-Fi: పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా..? వాడుకుని బ్యాకింగ్ ట్రాన్సక్షన్స్ చేస్తున్నారా? అయితే బీ అలర్ట్..!

COVID-19 Confirmed: ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానంటూ ట్వీట్..