Indian Navy Tradesman Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..10వ తరగతి అర్హతతో ఇండియన్‌ నావీలో 1531 ట్రేడ్స్‌మెన్‌ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ (Indian Navy ) జనరల్‌ సెంట్రల్‌ సర్వీస్‌ విభాగంలో గ్రూప్ సీ నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Indian Navy Tradesman Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..10వ తరగతి అర్హతతో ఇండియన్‌ నావీలో 1531 ట్రేడ్స్‌మెన్‌ ఉద్యోగాలు..
Untitled 3
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 17, 2022 | 7:30 AM

Indian Navy  Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ (Indian Navy ) జనరల్‌ సెంట్రల్‌ సర్వీస్‌ విభాగంలో గ్రూప్ సీ నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 1531

పోస్టుల వివరాలు: గ్రూప్‌ సీ సివిలియన్‌ ట్రేడ్స్‌మెన్‌ పోస్టులు

ఖాళీల వివరాలు: ఎలక్ట్రికల్‌ ఫిట్టర్‌, ఎలక్ట్రోప్లేటర్‌, ఇంజిన్‌ ఫిట్టర్‌, ఫౌండ్రీ, ఇన్‌స్ట్రుమెంట్‌ ఫిట్టర్, మెషినిస్ట్‌, వెల్డర్‌, రాడార్‌ ఫిట్టర్‌, రేడియో ఫిట్టర్‌, రిగ్గర్‌, వెపన్‌ ఫిట్టర్‌, షిప్‌ ఫిట్టర్‌, బాయిలర్‌ మేకర్‌, పెయింటర్‌ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: పోస్టును బట్టి నెలకు రూ.19,900ల నుంచి 63,200లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్‌తో పాటు ఇంగ్లిష్‌ నాలెడ్జ్‌ కూడా అవసరమే.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: వంద మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు వంద మార్కులు చొప్పున పరీక్ష ఉంటుంది. విభాగాల వారీగా ప్రశ్నలు ఎలా ఉంటాయంటే.. రీజనింగ్ 30, గణితం 20, ఇంగ్లీష్ 10, సంబంధిత ITI ట్రేడ్ ప్రశ్నలు 40 ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

UGC NET Results 2021: ఆదివారం నాటికి యూజీసీ నెట్‌ డిసెంబర్‌, జూన్‌ 2021 ఫలితాలు విడుదల.. యూజీసీ ప్రకటన!