UGC NET Results 2021: ఆదివారం నాటికి యూజీసీ నెట్‌ డిసెంబర్‌, జూన్‌ 2021 ఫలితాలు విడుదల.. యూజీసీ ప్రకటన!

నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) డిసెంబర్ 2020, జూన్ 2021 పరీక్షల ఫలితాలను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ బుధవారం (ఫిబ్రవరి 16) ప్రకటించింది..

UGC NET Results 2021: ఆదివారం నాటికి యూజీసీ నెట్‌ డిసెంబర్‌, జూన్‌ 2021 ఫలితాలు విడుదల.. యూజీసీ ప్రకటన!
Ugc Net
Follow us

|

Updated on: Feb 17, 2022 | 7:03 AM

UGC NET December 2020 and June 2021 results: నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) డిసెంబర్ 2020, జూన్ 2021 పరీక్షల ఫలితాలను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ బుధవారం (ఫిబ్రవరి 16) ప్రకటించింది. ఈ మేరకు యూజీసీ అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా తెలియజేసింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా డిసెంబర్-2020 నెట్‌ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష (యూజీసీ నెట్‌ డిసెంబర్ 2020) గత ఏడాది (2021) నవంబర్ 20 నుంచి ఈ ఏడాది (2022) జనవరి 5 మధ్యలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షలను నిర్వహించింది. యూజీసీ తాజా ప్రకటనలో.. ఎన్టీఏతో యూజీసీ సన్నిహితంగా పనిచేస్తోంది. ఫలితాల ప్రాసెసింగ్ జరుగుతోంది. యూజీసీ నెట్‌ ఫలితాలను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎమ్‌ జగదీష్ కుమార్ తెలిపారు.

దేశంలోని మొత్తం 239 నగరాల్లోని 837 పరీక్ష కేంద్రాల్లో 81 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు నిర్వహిచింది. మూడు దశల్లో నిర్వహించిన నెట్‌ పరీక్షకు 12 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. మొదటి దశ నవంబర్ 20, 2021 నుంచి డిసెంబర్ 5 వరకు, రెండవ దశ పరీక్షలు డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 27 వరకు, చివరి దశ జనవరి 4 నుంచి 5 వరకు జరిగాయి. కాగా ఈ పరీక్షల ఫలితాలు గత ఆదివారం వెలువడాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల ఫలితాలు ఆలస్యమయ్యింది. దీనికి సంబంధించి ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ వారం చివరి నాటికి ఫలితాలు వెలువడే అవకాశం ఉందని పేర్కొంది. ఐతే ఎటువంటి నిర్ణీత తేదీ లేదా సమయాన్ని తెలియజేయలేదు. స్కోర్‌కార్డ్‌తో పాటు, ఫైనల్ ఆన్సర్ కీ కూడా అధికారిక పోర్టల్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాలకు సంబంధించి తాజా అప్‌డేట్ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ugcnet.nta.nic.inను సందర్శించాలని యూజీసీ సూచించింది.

Also Read:

ECIL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో ఈసీఐఎల్‌ హైదరాబాద్‌ నోటిఫికేషన్‌.. రాత పరీక్షలేకుండానే ఉద్యోగాలు..

Latest Articles