Bank of Baroda Recruitment 2022: బ్యాంక్ జాబ్స్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్.. పూర్తివివరాలివే!
భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda)లోని ఎంఎస్‌ఎంఈ (MSME) విభాగం ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
Bank Of Baroda Executive Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda)లోని ఎంఎస్‌ఎంఈ (MSME) విభాగం ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 9
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఖాళీల వివరాలు: అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్: 3 సీనియర్ మేనేజర్: 3 మేనేజర్: 3
విభాగాలు: బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 23 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బీఈ/బీటెక్/ఎంసీఏతోపాటు డేటా మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. అలాగే సంబంధిత విభాగంలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 7, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: