Indian Navy Recruitment 2023: ఎలాంటి రాత పరీక్షలేకుండా కేంద్ర కొలువు.. నౌకాదళంలో 224 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారతీయ నౌకాదళంలో 244 కొలువు భర్తీకి అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్, పీజీ డిప్లొమా, ఎమ్మెస్సీ, ఎంబీఏ చదివినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఈ పోస్టులకు నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారు. ఈ నోటిఫికేషన్‌ కింద ఉద్యోగం పొందుకున్న వారికి సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో..

Indian Navy Recruitment 2023: ఎలాంటి రాత పరీక్షలేకుండా కేంద్ర కొలువు.. నౌకాదళంలో 224 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
Indian Navy
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 18, 2023 | 10:04 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారతీయ నౌకాదళంలో 244 కొలువు భర్తీకి అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్, పీజీ డిప్లొమా, ఎమ్మెస్సీ, ఎంబీఏ చదివినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఈ పోస్టులకు నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారు. ఈ నోటిఫికేషన్‌ కింద ఉద్యోగం పొందుకున్న వారికి సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలు అందించనుంది. ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్‌ బ్రాంచీల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జనరల్‌ సర్వీస్, ఏటీసీ, పైలట్, లాజిస్టిక్స్‌ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అన్ని పోస్టులకూ జులై 2, 1999 నుంచి జనవరి/జులై 1, 2003 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తులు పరిశీలించి వడపోత నిర్వహించి తుది జాబితాను సెలక్ట్‌ చేస్తారు. అనంతరం సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియలో మెరిట్‌ మార్కులు పొందినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు. ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉన్నవారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్వ్యూలో విజయం సాధించిన వారికి నేవల్‌ అకాడెమీ, ఎజిమాళలో 2024, జూన్‌ నుంచి 44 వారాలపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరికి నెలకు రూ.56,100 వరకు జీతంగా చెల్లిస్తారు. జీతంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్స్‌ను కూడా అందిస్తారు. వీటన్నింటితో కలిపి మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు. ప్రొబేషన్‌ వ్యవధి రెండేళ్లు ఉంటుంది. ప్రొబేషన్‌ వ్యవధి పూర్తయ్యాక పదేళ్లు విధుల్లో కొనసాగుతారు. అనంతరం పనితీరును బట్టి మరో నాలుగేళ్లు సర్వీస్‌ వ్యవధి పొడిగిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబరు 29, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు, అర్హతలు

  • ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌ పోస్టులకు జనరల్‌ సర్వీస్‌ హైడ్రో క్యాడర్‌ విభాగంలో 40 వరకు పోస్టులు ఉన్నాయి. ఏదైనా బ్రాంచీలో బీఈ లేదా బీటెక్‌ చదివినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ 8 పోస్టులు, నేవల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ 18 పోస్టులు, పైలట్‌ పోస్టులు 20 వరకు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటికీ బీఈ/బీటెక్‌ విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పై పోస్టులన్నింటికీ పది, ఇంటర్, ఇంజినీరింగ్‌లలో తప్పనిసరిగా 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే పది/ఇంటర్‌లలో ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ 60 శాతం మార్కులు పొంది ఉండాలి.
  • లాజిస్టిక్స్‌ విభాగంలో 20 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు బీఈ/బీటెక్‌/ఎంబీఏ/ఎంసీఏ/ఎమ్మెస్సీ లేదా ఫైనాన్స్‌/లాజిస్టిక్స్‌/సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌/మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
  • ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌లో 18 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు బీఎస్సీ/ఎమ్మెస్సీ/బీఈ/బీటెక్‌ 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
  • టెక్నికల్‌ బ్రాంచ్‌కు సంబంధించి ఇంజినీరింగ్‌లో 30, ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌లో 50, నేవల్‌ కన్‌స్ట్రక్టర్‌ విభాగంలో 20 పోస్టులు ఉన్నాయి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..