Indian Coast Guard Jobs: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..

Indian Coast Guard Recruitment: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖకి చెదిన ఈ సంస్థ నోయిడాలోని ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు...

Indian Coast Guard Jobs: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..
Indian Coast Guard
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 14, 2022 | 6:51 PM

Indian Coast Guard Recruitment: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖకి చెదిన ఈ సంస్థ నోయిడాలోని ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 11 ఫోర్‌మెన్ (స్పోర్ట్స్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎకనామిక్స్‌/కామర్స్‌/స్టాటిస్టిక్స్‌/ బిజినెస్‌ స్టడీస్‌/ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను డైరెక్టర్‌ జనరల్‌, కోస్ట్‌ గార్డ్‌ హెడ్‌క్వార్టర్స్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రిక్రూట్‌మెంట్‌, ఫేజ్‌ 2, ఇండస్ట్రియల్‌ ఏరియా, సెక్టర్‌ 62, నోయిడా, యూనీ 201309 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: AP Political War on Status: ఏపీ రాజకీయాల్లో భగ్గుమంటున్న కేంద్ర హోంశాఖ రేపిన చిచ్చు!

Vijayawada News: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. డబ్బులు ఇవ్వలేదని పేషెంట్‌తో అమానుషంగా..

Anurag Thakur vs KCR: పాకిస్తాన్ మాటల్లా ఉన్నాయి.. కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి..