AP Political War on Status: ఏపీ రాజకీయాల్లో భగ్గుమంటున్న కేంద్ర హోంశాఖ రేపిన చిచ్చు!

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాపై రచ్చ మళ్లీ మొదలైంది. హోదా అంశంపై పార్టీల మధ్య బ్లేమ్‌గేమ్‌ నడుస్తోంది. అంతా మీరే చేశారంటూ బీజేపీ ఎంపీని టార్గెట్‌ చేసింది వైసీపీ. మీ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి అబండాలు వేస్తారా అంటూ కౌంటరిస్తున్నారు‌కాషాయం నేతలు.

AP Political War on Status: ఏపీ రాజకీయాల్లో భగ్గుమంటున్న కేంద్ర హోంశాఖ రేపిన చిచ్చు!
Ap Special Status
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 14, 2022 | 4:42 PM

AP Political War on Special Status: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రత్యేకహోదాపై రచ్చ మళ్లీ మొదలైంది. హోదా అంశంపై పార్టీల మధ్య బ్లేమ్‌గేమ్‌ నడుస్తోంది. అంతా మీరే చేశారంటూ బీజేపీ(BJP) ఎంపీని టార్గెట్‌ చేసింది వైసీపీ(YSRCP). మీ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి అబండాలు వేస్తారా అంటూ కౌంటరిస్తున్నారు‌కాషాయం నేతలు. క్రెడిట్‌ మీకు.. అవమానం మాకా అంటూ ఫైర్‌ అవుతున్నారు టీడీపీ నాయకులు. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సబ్‌కమిటీలో స్టేటస్‌ అంశాన్ని పెట్టి అనంతరం తీసేయడంలో యాక్షన్ జీవీఎల్‌ ది అయితే.. డైరెక్షన్ చంద్రబాబుది అంటోంది వైసీపీ. అంటే మీ అసమర్థతను అంగీకరిస్తున్నారా అని తెలుగుదేశం అంటే.. ఎవరి దర్శకత్వంలో పనిచేయాల్సిన అవసరం తనకు లేదంటూ వైసీపీకి కౌంటర్‌ ఇచ్చారు బీజేపీ ఎంపీ.

రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్రం వేసిన అధికారుల కమిటీ ఎజెండాలో ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడం… ఆ తర్వాత దాన్ని తొలగిస్తూ కొత్తగా ఉత్తర్వులివ్వడం వెనక టీడీపీ కుట్ర ఉందంటోంది అధికారపార్టీ. వైసీపీ దీనిని పోరాడి సజీవంగా ఉంచితే జీర్ణించుకోలేని తెలుగుదేశం తమ కోవర్టుల చేత తొలిగించేలా చేసిందంటూ విమర్శిస్తోంది. అజెండాలోని 9 అంశాలను పెట్టి తర్వాత సవరణ అజెండా విడుదల చేయడానికి టీడీపీ బాస్‌‌ చంద్రబాబు నుంచి వచ్చిన ఒత్తిళ్లే కారణమంటోంది. చంద్రబాబు సలహాలను GVL అమలు చేస్తున్నారని.. అందుకే పట్టబట్టి మరీ కేంద్ర కమిటీ అజెండాలోంచి ప్రత్యేక హోదా అంశాన్ని తప్పించేశారని ఆరోపించింది వైసీపీ. ప్రత్యేక హోదాకు జీవం పోస్తే ఏపీలో బీజేపీ ఇంకా చచ్చిపోతుందన్న జీవీఎల్ ఆలోచనే ఈ దుర్మార్గానికి కారణమంటోంది.

వైసీపీ చేసిన కామెంట్లకు స్ట్రాంగ్‌ రియాక్షన్ ఇస్తున్నారు ఎంపీ జీవీఎల్‌. ప్రభుత్వ వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే వైసీపీ నేతలు కొత్త రాజకీయ అంశాలు తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించడానికి వేసిన కమిటీ సమావేశంలో ప్రత్యేక హోదా ఎజెండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తోంది బీజేపీ. మోదీ, అమిత్‌షాల తీసుకునే నిర్ణయాలను చంద్రబాబు చెబితే మారుస్తారా అంటూ ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానంగా కేంద్రానికి లేఖ రాశామని.. త్వరలోనే అజెండా మారడంపై వివరణ వస్తుందన్నారు. చేతకాని తనంతోరాష్ట్రానికి వచ్చిన నిధులే రాబట్టలేదని.. ముగిసిన అధ్యాయం హోదాపై ఎందుకీ డ్రామాలంటోంది భారతీయ జనతా పార్టీ.

అటు టీడీపీ కుట్ర ఉందంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపైనా ఈ పార్టీ నేతలు రియాక్ట్‌ అయ్యారు. అజెండాలో ఉంది అనగానే రోజంతా క్రెడిట్‌ కోసం ఆరాటపడ్డ వైపీపీ నాయకులుకు అజెండా మారడంతో టీడీపీ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే హోదా అంశం సాధ్యం కాదన్న ప్రభుత్వం పెద్దలు.. ఇప్పుడు తామే పోరాటం చేస్తున్నామని కలరింగ్‌ ఇచ్చి అవమానాల పాలయ్యారన్నారు. మమత, కేసీఆర్‌, స్టాలిన్‌ కేంద్రంపై తమ హక్కుల కోసం పోరాడుతున్నా జగన్‌ కనీసం అజెండాలో పెట్టి తీసిన హోదా అంశంపై కూడా అడగలేకపోతున్నారంటూ ఎటాక్‌ చేసింది టీడీపీ.

మొత్తానికి కేంద్రం ఇచ్చిన అజెండా రేపిన రచ్చలో పడి పార్టీలు కొట్టుకుంటున్నాయి. కలిసికట్టుగా ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో నిలదీయాల్సిన ఎంపీలు ఒకరిపై ఒకరు విమర్శలతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు హోదా అంశాన్ని అజెండాలో పెట్టి తీసేస్తే కూడా నిందలతో కాలం వెళబుచ్చుతున్నాయి పార్టీలు. మరి న్యాయం జరిగేదెలా?

Read Also…  Kishanreddy on KCR: సర్జికల్ స్ట్రైక్స్‌పై వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం.. సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్!