Army recruitment: ఇండియన్‌ ఆర్మీలో టీచర్‌ పోస్టులు.. ఎవరు అర్హులు.? ఎలా ఎంపిక చేస్తారంటే..

ఇండియన్‌ ఆర్మీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆర్‌ఆర్‌టీ 91,92 కోర్సుల్లో భాగంగా జూనియర్ కమిషన్ ఆఫీసర్లుగా రిలీజియస్ టీచర్ల నియామకానికి నోటిఫికేషణ్‌ విడుదల చేశారు. ఈ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఏయే విభాగాల్లో...

Army recruitment: ఇండియన్‌ ఆర్మీలో టీచర్‌ పోస్టులు.. ఎవరు అర్హులు.? ఎలా ఎంపిక చేస్తారంటే..
Indian Army Jobs
Follow us

|

Updated on: Oct 09, 2022 | 7:53 AM

ఇండియన్‌ ఆర్మీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆర్‌ఆర్‌టీ 91,92 కోర్సుల్లో భాగంగా జూనియర్ కమిషన్ ఆఫీసర్లుగా రిలీజియస్ టీచర్ల నియామకానికి నోటిఫికేషణ్‌ విడుదల చేశారు. ఈ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 127 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పండిట్ (108), గుర్ఖా రెజిమెంట్ పండిట్ (గూర్ఖా) (5), గ్రంథి (8), మౌల్వీ (సున్నీ) (3), మౌల్వీ (షియా)- లడఖ్ స్కౌట్స్ (1), పాడ్రే (2), బొథ్ మాంక్ – లడఖ్ స్కౌల్స్ (మహాయాన) (1) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు అక్టోబర్ 1, 2022 నాటికి 25 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి.

* ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఫిజికల్ స్టాండర్డ్, ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తులస్వీకరణకు 06-11-2022ని చివరి తేదీగా నిర్ణియంచారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..