AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCERT Recruitment: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం..

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే సంస్థ దేశంలోని పలు యూనిట్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. అజ్‌మేర్‌, భోపాల్, భువనేశ్వర్, మైసూరు, షిల్లాంగ్‌లలో ఉన్న..

NCERT Recruitment: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం..
Ncert Recruitment
Narender Vaitla
|

Updated on: Oct 09, 2022 | 8:14 AM

Share

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే సంస్థ దేశంలోని పలు యూనిట్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. అజ్‌మేర్‌, భోపాల్, భువనేశ్వర్, మైసూరు, షిల్లాంగ్‌లలో ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ యూనిట్లలో ఉన్న అకడమిక్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 292 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఆఫీస్ మేనేజ్‌మెంట్/ స్టెనోగ్రఫీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* సైకాలజీ, ఎడ్యుకేషన్, స్టాటిస్టిక్స్, చైల్డ్ డెవలప్‌మెంట్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, బోటనీ, స్టాటిస్టిక్స్, సోషియాలజీ, హిస్టరీ, కామర్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పాపులేషన్ స్టడీస్, హిందీ, ఉర్దూ, ఇంగ్లిషు, సంస్కృతం, కన్నడ, ఒడియా సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, నెట్‌, స్లెట్‌, సెట్‌ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన/ బోధన అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ప్రొఫెసర్/ లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్/ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఖాళీలకు రూ.57,700 అందిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 28-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?
హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?
తొలి మ్యాచ్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. ఉప్పల్‌లో డెబ్యూకు రెడీ
తొలి మ్యాచ్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. ఉప్పల్‌లో డెబ్యూకు రెడీ
జురాసిక్ కాలం నాటి వుల్లీ మమ్మోత్‌లకు మళ్లీ ప్రాణం పోస్తున్న AI
జురాసిక్ కాలం నాటి వుల్లీ మమ్మోత్‌లకు మళ్లీ ప్రాణం పోస్తున్న AI
బీపీ, షుగర్ అదుపులో ఉండాలంటే ఈ ఉప్మా తినండి చాలు..
బీపీ, షుగర్ అదుపులో ఉండాలంటే ఈ ఉప్మా తినండి చాలు..
ఏపీలో నాణ్యమైన ఉల్లిపాయలు కిలో రూ.35కే..
ఏపీలో నాణ్యమైన ఉల్లిపాయలు కిలో రూ.35కే..
పండగ సేల్స్‌లో ANC ఫీచర్‌తో వచ్చే టాప్-5 నెక్‌బ్యాండ్స్ ఇవే!
పండగ సేల్స్‌లో ANC ఫీచర్‌తో వచ్చే టాప్-5 నెక్‌బ్యాండ్స్ ఇవే!
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
రంగు నలుపు.. ఘాటు మాత్రం అదుర్స్..
రంగు నలుపు.. ఘాటు మాత్రం అదుర్స్..
తొలి వెబ్ సిరీస్‌తోనే సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ డేగల బాబు
తొలి వెబ్ సిరీస్‌తోనే సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ డేగల బాబు