IGNOU July 2022: ఇగ్నో 2022 జులై సెషన్ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం..
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జులై 2022 సెషన్ కోసం అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), డిగ్రీ ఆనర్స్, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 30 (సోమవారం)న..
IGNOU 2022-23 July Admissions: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జులై 2022 సెషన్ కోసం అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), డిగ్రీ ఆనర్స్, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 30 (సోమవారం)న ప్రారంభించింది. ఓపెన్ మోడ్‌లో అడ్మిషన్ తీసుకోవాలనుకునే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ ignouadmission.samarth.edu.in లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇగ్నో జూలై 2022 సెషన్‌కు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 31గా తెలుపుతూ ఇగ్నో అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేసింది.
ఇగ్నో జూలై 2022 సెషన్ కోసం ఎలా నమోదు చేసుకోవాలంటే..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ ignouadmission.samarth.edu.inను ఓపెన్ చెయ్యాలి
- ‘Click here for new registration’ అనే లింక్‌పై క్లిక్ చెయ్యాలి
- అవసరమైన వివరాలతో ఇగ్నో జూలై రిజిస్ట్రేషన్ ఫామ్‌ను పూర్తి చేసి, సబ్‌మిట్‌పై క్లిక్ చెయ్యాలి.
- ఆ తర్వాత ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తుంది.
- వీటితో లాగిన్ అయ్యి, అడ్మిషన్ ఫామ్‌ను పూర్తిచెసి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
- అడ్మిషన్ ఫామ్‌ను సేవ్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోవాలి.
The July 2022 Fresh-Admission cycle has commenced from today (30/05/2022). Last date of Fresh-Admissions for the July 2022 Session is 31st July 2022. https://t.co/pagTvEQgzi
— IGNOU (@OfficialIGNOU) May 30, 2022
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.