IDBI Recruitment 2022: ఐడీబీఐలో 1544 పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? రేపే ఆఖరు..
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI)లో 1544 ఎగ్జిక్యూటివ్ (Executives), అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ (Assistant Manager) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. పదో తరగతి..
IDBI Executive, Assistant Manager Recruitment 2022: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI)లో 1544 ఎగ్జిక్యూటివ్ (Executives), అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ (Assistant Manager) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. పదో తరగతి పాసైన అభ్యర్ధులెవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచిస్తోంది. ఈ సందర్భంగా నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.
వివరాలు:
మొత్తం ఖాళీలు: 1544
పోస్టులు:
- ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 1044
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: 500
వయోపరిమితి: ఏప్రిల్ 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష (ఆన్‌లైన్) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: మొత్తం 200ల మార్కులకు, 2 గంటల వ్యవధిలో 200ల ప్రశ్నలకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ.1000
- ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ.200
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్ 3, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 17, 2022.
ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రాత పరీక్ష తేదీ: జులై 9, 2022.
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రాత పరీక్ష తేదీ: జులై 23, 2022.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.