Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICMR-VCRC Recruitment 2022: హైస్కూల్‌ విద్యార్హతలతో ఐసీఎంఆర్‌- వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

భార‌త ప్రభుత్వ సంస్థ అయిన పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్‌- వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్‌ (ICMR-VCRC).. ఒప్పంద ప్రాతిప‌దిక‌న 15 ప్రాజెక్ట్ టెక్నీషియన్-3, ఫీల్డ్ వర్కర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్-1, డేటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్-బి) పోస్టుల (Project Technician Posts) భర్తీకి..

ICMR-VCRC Recruitment 2022: హైస్కూల్‌ విద్యార్హతలతో ఐసీఎంఆర్‌- వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Icmr Vcrc
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 22, 2022 | 9:09 AM

ICMR-VCRC Project Technician Recruitment 2022: భార‌త ప్రభుత్వ సంస్థ అయిన పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్‌- వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్‌ (ICMR-VCRC).. ఒప్పంద ప్రాతిప‌దిక‌న 15 ప్రాజెక్ట్ టెక్నీషియన్-3, ఫీల్డ్ వర్కర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్-1, డేటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్-బి) పోస్టుల (Project Technician Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి హైస్కూల్‌ విద్యార్హతలు, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, డీఎంఎల్‌టీ, బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 28 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ అర్హతలున్నవారు ఎవరైనా సెప్టెంబర్‌ 26, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపిచవల్సి ఉంటుంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచినవారికి నెలకు రూ.16,000ల నుంచి రూ.18,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: The Director, ICMR-VECTOR CONTROL RESEARCH CENTRE, Medical Complex, Indira Nagar, Puducherry – 605 006.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.