Bank of Baroda Jobs 2022: బ్యాంక్‌ జాబ్స్‌! రాత పరీక్షలేకుండా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుండాలి..

భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank Of Baroda).. ఒప్పంద ప్రాతిపదికన 72 డిజిటల్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌, డిజిటల్‌ లెండింగ్‌ రిస్క్‌ స్పెషలిస్ట్‌, తదితర పోస్టుల (Digital Marketing Specialist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Bank of Baroda Jobs 2022: బ్యాంక్‌ జాబ్స్‌! రాత పరీక్షలేకుండా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుండాలి..
Bank Of Baroda
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 22, 2022 | 8:53 AM

Bank of Baroda Digital Marketing Specialist Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank Of Baroda).. ఒప్పంద ప్రాతిపదికన 72 డిజిటల్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌, డిజిటల్‌ లెండింగ్‌ రిస్క్‌ స్పెషలిస్ట్‌, స్పెషల్‌ అనలిస్ట్‌, బిజినెస్‌ మేనేజర్‌, జోనల్‌ మేనేజర్‌ తదితర పోస్టుల (Digital Marketing Specialist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పర్సనల్‌ లోన్‌, ఎంఎస్‌ఎంఈ లోన్‌, ఆటో లోన్‌, యూపీఐ, బీబీపీఎస్‌, ఫాస్టాగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, బీఎన్‌పీఎల్‌, డెబిట్‌కార్డ్‌, యూఐ/ యూఎక్స్‌ స్పెషలిస్ట్‌, లీడ్‌ కియాస్క్‌ ఆపరేషన్స్‌, డిజిటల్‌ పేమెంట్‌ ఫ్రాడ్‌ ప్రివెన్షన్‌, రెకన్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌, డేటా ఇంజినీరింగ్‌, క్రియేటివ్‌ డిజైనింగ్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌/బీఈ/బీటెక్‌/బీఎస్సీ/బీసీఏ/ఎంసీఏ/సీఏ/సీఎఫ్‌ఏ/ఎంబీఏ/పీజీ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 11, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.600లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?