ICF Recruitment: కోచ్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. చెన్నైలోని ఈ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్పోర్ట్స్‌లో కోటాలో లెవెల్-1 (ఎర్ట్స్ వైల్ గ్రూప్ - డి) ఉద్యోగాను 2022-23 ఏడాదికి గాను నియమించుకోనున్నారు. ఇందులో భాగంగా..
ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. చెన్నైలోని ఈ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్పోర్ట్స్‌లో కోటాలో లెవెల్-1 (ఎర్ట్స్ వైల్ గ్రూప్ – డి) ఉద్యోగాను 2022-23 ఏడాదికి గాను నియమించుకోనున్నారు. ఇందులో భాగంగా ప్రతిభ గల క్రీడాకారుల నుంచి దరఖాస్తులసు ఆహ్వానిస్తోంది. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఫుట్ బాల్ (పురుషులు) , బాడీ బిల్డింగ్ (పురుషులు), కబడ్డీ (పురుషులు), హాకీ (పురుషులు), క్రికెట్ (పురుషులు), వెయిట్ లిఫ్టింగ్ (పురుషులు) వంటి క్రీడల్లో ప్రావీణ్యత ఉండాలి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి, ఐటిఐ ఉత్తీర్ణతతో పాటు వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులై ఉండాలి
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ట్రయల్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తులను అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్/రిక్రూట్ మెంట్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై చిరునామాకు పంపాలి.
* ట్రయల్స్‌ను మార్చి 28,29 తేదీల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ మార్చి 13వ తేదీతో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..