Exams Tips: ఎగ్జామ్స్ ముంచుకొస్తున్నాయని రాత్రీ పగలు చదివేస్తున్నారా.. ఆగండాగండి.. ఒకసారి ఈ టిప్స్ ఫాల్ అవ్వండి..
పరీక్షల కాలం ముంచుకొస్తోంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకూ టెన్షన్ తప్పని సిట్యువేషన్. ఎగ్జామ్స్ లో ఎలా గట్టెక్కుతామని స్టూడెంట్స్ ఆలోచిస్తే.. వారు ఎలా పరీక్షలు రాస్తారోనని పేరెంట్స్ తెగ టెన్షన్ పడిపోతున్నాయి..
పరీక్షల కాలం ముంచుకొస్తోంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకూ టెన్షన్ తప్పని సిట్యువేషన్. ఎగ్జామ్స్ లో ఎలా గట్టెక్కుతామని స్టూడెంట్స్ ఆలోచిస్తే.. వారు ఎలా పరీక్షలు రాస్తారోనని పేరెంట్స్ తెగ టెన్షన్ పడిపోతున్నాయి. అయితే.. ఏ మాత్రం కంగారు, ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పీస్ ఫుల్ గా ఉన్నప్పుడే చదివిన విషయం గుర్తుకు వచ్చి.. ఎగ్జామ్ లో రాసేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా విద్యార్థులు ధైర్యంగా పరీక్షలను ఎదుర్కొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరుతున్నారు. అకాడమిక్ పరీక్షలతో పాటు.. ఉద్యోగాలకు పోటీపడే పరీక్షలు కూడా త్వరలోనే స్టార్ట్ కానున్నాయి. చెప్పాలంటే విద్యార్థులకు ఇది కష్టకాలం. కడుపు నిండా తినకుండా, కంటి నిండా నిద్రపోకుండా పరీక్షకు సిద్ధం అవుతుంటారు. కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు. ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు మార్గనిర్దేశం చేయాలి.
పిల్లలు పరీక్షలకు వెళ్లే సమయంలో వారి అవసరాలను తల్లిదండ్రులు చూసుకోవాలి. ప్రధానంగా తల్లిదండ్రులు వారి ఆహారం, తాగే నీటి పట్ల శ్రద్ధ వహించాలి. లేదంటే పిల్లలు ఎంత బాగా చదివినా పరీక్షలో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆహారం-నిద్ర అనేది ఏ పరీక్షలోనైనా విజయంలో పెద్ద భాగం. ఈ రెండింటినీ సమతూకంలో ఉంచుకుంటే శారీరకంగా, మానసికంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షను ఎదుర్కోవచ్చు. ఆరోగ్యకరమైన స్నాక్స్ తినండి. ఒకేసారి అనేక పదార్థాలు తినడానికి బదులుగా, కొన్ని గంటలలో తేలికపాటి ఆరోగ్యకరమైన భోజనం తినండి. దీని వల్ల మీకు బద్ధకం ఉండదు.
పరీక్షల సమయంలో బయటి ఆహారం తినడం మానేయాలి. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫాస్ట్ ఫుడ్, హోటల్ భోజనం ఎప్పుడూ పూర్తిగా ఆరోగ్యకరం కాదు. పుష్కలంగా నీరు తాగాలి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. తక్కువ నీరు తాగితే చికాకు వస్తుంది. అల్పాహారాన్ని ఎప్పుడూ స్కిప్ చేయవద్దు. ఉదయం పూట పోషకాలతో కూడిన అల్పాహారం మిమ్మల్ని రోజంతా తాజాగా ఉంచుతుంది. మీ ఆకలి, మానసిక స్థితికి అనుగుణంగా అల్పాహారంతో రోజును ప్రారంభించాలి.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 తెలుగు ధ్రువీకరించడం లేదు.