AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIMS: డిగ్రీ పాస్ అయ్యారా.. ఇదే మంచి అవకాశం..! నిమ్స్ మెడికల్ కాలేజ్‌లో కొత్త కోర్సుకు దరఖాస్తులు

నిమ్స్ మెడికల్ కాలేజ్ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నిమ్స్ మెడికల్ కాలేజ్‌లో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్‌కి అప్లై చేసుకోవాలని కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

NIMS: డిగ్రీ పాస్ అయ్యారా.. ఇదే మంచి అవకాశం..! నిమ్స్ మెడికల్ కాలేజ్‌లో కొత్త కోర్సుకు దరఖాస్తులు
Hyderabad NIMS Medical College
Yellender Reddy Ramasagram
| Edited By: Srilakshmi C|

Updated on: Jul 25, 2023 | 1:32 PM

Share

హైదరాబాద్‌, జులై 25: నిమ్స్ మెడికల్ కాలేజ్ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నిమ్స్ మెడికల్ కాలేజ్‌లో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్‌కి అప్లై చేసుకోవాలని కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత 19 సంవత్సరాలుగా ఈ MHM కోర్స్ నిర్వహిస్తూ వందలాది మంది విద్యార్థులను ఎంతో మంచి పొజిషన్ లో సెటిల్ అయ్యే అవకాశం ఇస్తుంది నిమ్స్.

లక్షల్లో జీతం మంచి లైఫ్ లో సెట్ అవ్వలనుకునే విద్యార్థుల కలను నిమ్స్ మెడికల్ కాలేజ్ నిర్వహిస్తున్న మాస్టర్స్ ఇన్ హా స్పిటల్ మేనేజ్మెంట్ (ఎంహెచ్ఎం) కోర్సుతో సాధ్యం అవుతుంది అని అంటున్నారు నిమ్స్ వైద్యులు.రెండున్నర సంవత్సరాల లో కాల పరిమితి ఉన్న ఈ కోర్స్ పూర్తి చేస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని నిమ్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగం,మెడికల్ విభాగం, కోర్సు అకడమిక్ ఇన్చార్జి డాక్టర్ లు అంటున్నారు. దేశంలోనే ఎంహెచ్ఎం కోర్సు అందిస్తున్న మెడికల్ కాలేజ్ ఒక్క నిమ్స్ మాత్రమేనని తెలిపారు. నిమ్స్ మెడికల్ కాలేజ్ లో ఎంహెచ్ఎం కోర్సు 19 ఏండ్లు పూర్తి చేసుకుంది.. ఈ 20వ సంవత్సరంలో 20 సీట్లకు దరఖాస్తులను ఆహ్వా నిస్తున్నామని చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 5 వరకు ఆన్లైన్ లో, 9వ తేదీ వరకు దరఖాస్తులను నేరుగా అందజేయాలని సూచించారు.

నిమ్స్ మెడికల్ కాలేజ్ లో ఎంహెచ్ఎం కోర్సులో చేరలంటే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి.. 2023 డిసెంబర్ 31 వరకు 30 ఏళ్ళ లోపు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వారికి మూడేండ్ల సడలింపు ఉంటుందనీ..ఆయా అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి.అర్హులైన వారికి వందశాతం ఫీజురీయింబర్స్మెంట్ ఉంటుంది.అధికారులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

నిమ్స్ మెడికల్ కాలేజ్ లో చేరే ఈ MHM కోర్స్ పూర్తి అయిన తరవాత ఫార్మా, హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ టూరిజం, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పటల్, హెల్త్ కేర్, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, మెడికల్ ట్రాన్సికిప్షన్, మెడికల్ కోడింగ్ లాంటి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయని నిమ్స్ వైద్య అధ్యపాకులు అంటున్నారు. వివరాలకు వెబ్ సైట్లో సంప్రదించాలని సూచించారు.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.