AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hiring trends 2021: ఐటీ రంగంపై కరోనా ఎలాంటి ప్రభావం చూపింది.? రానున్న రోజుల్లో ఉద్యోగాలను శాసించే అంశాలు ఏంటి..

Hiring trends 2021: కరోనా ప్రభావం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రపంచానికి పెద్దన్నలుగా చెప్పుకున్న దేశాలు సైతం...

Hiring trends 2021: ఐటీ రంగంపై కరోనా ఎలాంటి ప్రభావం చూపింది.? రానున్న రోజుల్లో ఉద్యోగాలను శాసించే అంశాలు ఏంటి..
Corona It Industry
Narender Vaitla
|

Updated on: Aug 05, 2021 | 8:05 PM

Share

Hiring trends 2021: కరోనా ప్రభావం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రపంచానికి పెద్దన్నలుగా చెప్పుకున్న దేశాలు సైతం అతలాకుతలమయ్యాయి. అయితే ఈ ప్రభావం ఐటీ రంగంపై ఎలా ఉంది.? ఫ్రెషర్స్‌ ఉద్యోగం పొందాలంటే ఎలాంటి విజ్ఞానాన్ని పెంచుకోవాలి లాంటి అంశాలపై టెక్‌ మహీంద్ర గ్లోబల్‌ హెడ్‌ క్రిష్ణ గోపాల్‌ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ అయిన టెక్‌ మహీంద్ర ఫ్రెషర్స్‌ను వేగంగా పెంచుకునే పరిలో పడింది. ఇప్పటికే జూన్‌ నాటికి ఏకంగా 5,200 మందిని నియమించుకుంది. ఇక నాగ్‌పూర్‌, తిరువనంతపురం, భువనేశ్వర్‌, విశాఖపట్నంలాంటి టైర్‌ 2 నగరాల్లోనూ ఉద్యోగులను పెద్ద మొత్తంలో రిక్రూట్‌ చేసుకోన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, స్పేస్‌ టెక్నాలజీస్‌, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి రంగాల్లో ఏకంగా 1.26 లక్షల మంది ప్రతిభావంతులను నియమించుకోనున్నారు.

కరోనా కారణంగా నియామకాల్లో ఎలాంటి మార్పులు జరిగాయి..

కరోనా మహమ్మారి వల్ల నియామక విధానంలో ఏదైన మార్పులు జరిగాయా అన్ని దానికి గ్లోబల్‌ హెడ్‌ క్రిష్ణ గోపాల్‌ స్పందిస్తూ.. ‘కరోనా తర్వాత రిక్రూట్‌మెంట్‌ విధానంలో స్పష్టమైన మార్పులు వచ్చాయి. ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం కారణంగా. కేవలం మెట్రో నగరాలే కాకుండా టైర్‌ 2 సిటీల్లోని ఉద్యోగులను కూడా నియమించుకోగలం. ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పాండమిక్‌ తర్వాత అన్ని కంపెనీలు క్లౌడ్‌ టెక్నాలజీ వినియోగాన్ని అనివార్యంగా భావించాయి. ఇది భద్రతకు కూడా భరోసానిస్తోంది. ఇక కార్పొరేట్‌ కంపెనీలు ఆటోమేషన్, సెక్యూరిటీపై కూడా దృష్టిసారిస్తున్నాయి. దీంతో ఈ రంగాల్లో ఉద్యోగులను పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం వస్తోంది.

క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లు పెరగడానికి కారణం..

అప్పుడే విద్యను పూర్తి చేసిన వారు టెక్నాలజీలను ఆసక్తికగా ఏర్చుకుంటారు. వీరిలో కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు త్వరగా నేర్చుకోవడమే కాకుండా మార్పును ఆహ్వానిస్తారు. కష్టపడి పనిచేసే తత్వ్తం యూత్‌లో ఎక్కువగా ఉంటుంది కాబట్టే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌కు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఒకప్పుడు ఏదో ఒక్క టెక్నాలజీ నేర్చుకొని హాయిగా పనిచేసుకునే వారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతోంది. ఈ మారుతోన్న ట్రెండ్‌ను యువకులు తొందరగా ఒడిసిపట్టుకోగలరు.

మారుతోన్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల పరిజ్ఞానం ఉందా.?

ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఎప్పుడూ పరిశ్రమకు సరిపోయే వ్యక్తులను తయారు చేయలేవు. సహజంగా ప్రైవేటు రంగంలో నియామకాలను చూస్తే.. రిక్రూటర్స్‌ ఎక్కువగా నేర్చుకోగలిగే ఆసక్తి ఉన్న వారికి పెద్దపీఠ వేస్తారు. ఎందుకంటే రిక్రూట్‌ చేసుకున్న తర్వాత సదరు వ్యక్తికి కంపెనీకి సరిపోయే టెక్నాలజీని నేర్పించుకుంటారు. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ల నుంచి అభ్యర్థి నుంచి క్రమశిక్షణ, సమయపాలన, కొత్త విషయాలను నేర్చుకోవడంలో అభ్యర్థి చూపించే ఆసక్తిలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.

కరోనా మహమ్మారి వర్క్‌ కల్చర్‌పై ఎలాంటి ప్రభావం చూపింది.?

కరోనా కారణంగా సొంతూళ్లకు వెళ్లిపోయిన చాలా మంది తిరిగి రావడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. వర్క్‌ ఫ్రమ్‌ విధానంతో ఇంటి దగ్గరే ఉంటూ పనిచేసుకుంటున్నారు. అయితే ఈ విధానం వల్ల వచ్చే ప్రధాన సమస్య ఓపెన్‌ ఇంటర్‌ వినియోగమే. దీనివల్ల డేటా ప్రమాదంలో పడే అవకాశాలుంటాయి. సాధారణంగా ఆఫీసుల్లో ఉండే భద్రత వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో లభించదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మన దగ్గర వేరే ఛాయిస్‌ లేదు కదా.!

Also Read: అనిల్ దేశ్ ముఖ్ కేసు.. మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న సీబీఐ…

Breastfeeding Week 2021 : తల్లి పాల ప్రాముఖ్యతను ప్రతి మహిళ తెలుసుకోవాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..?

Prakash Raj: ‘తెగేదాకా లాక్కండి’.. మోనార్క్ ట్వీట్‌తో ఇండస్ట్రీలో రచ్చ రచ్చ