అనిల్ దేశ్ ముఖ్ కేసు.. మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న సీబీఐ…
మహారాష్ట్రలో మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కేసు దర్యాప్తు ఇంకా నత్తనడకన సాగుతోంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదని సీబీఐ బాంబేహైకోర్టుకు తెలిపింది.
మహారాష్ట్రలో మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కేసు దర్యాప్తు ఇంకా నత్తనడకన సాగుతోంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదని సీబీఐ బాంబేహైకోర్టుకు తెలిపింది. పైగా కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తమతో సమన్వయంగా వ్యవహరించక పోగా ..ముంబై పోలీసు శాఖలో ఓ ఏసీపీ తమ అధికరినొకరిని బెదిరిస్తున్నారని ఆరోపించింది. దీనిపై కోర్టు సీరియస్ అయింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తూ ఈ కేసు విచారణ మళ్ళీ ఈ నెల 11 న జరగాలని సూచించింది. ముంబై పోలీసు శాఖలో ఎవరో ఏసీపీ ..సిబిఐ అధికారిని బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయని, దీనిపై ఆరా తీయాలని న్యాయమూర్తులు ఎస్.ఎస్. షిండే, జమాదార్ లతో కూడిన బెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశించింది. పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తే తాము తీవ్రమైన చర్య తీసుకోవలసి ఉంటుందని కూడా బెంచ్ హెచ్చరించింది. అనిల్ దేశ్ ముఖ్ అవినీతి కేసును సీబీఐ గత రెండు మూడు నెలలుగా విచారిస్తోంది. ముంబై, నాగ పూర్ లలో గల ఆయన నివాసాలపై రెండు సార్లు దాడులు జరిపింది.
ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి తనకు నెలకు 100 కోట్ల రూపాయలను వసూలు చేసి ఇవ్వవలసిందిగా అనిల్ దేశ్ ముఖ్ లోగడ మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేని ఆదేశించడం, ఆ తరువాత వాజేని జాతీయ దర్యాప్తు సంస్థ తమ కస్టడీలోకి తీసుకుని జైలుకు పంపడం తెలిసిందే. వాజే బెయిల్ పిటిషన్ ని కోర్టు నాడు తోసిపుచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి: అనిల్ దేశ్ ముఖ్ కేసు.. మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న సీబీఐ…
Ramayapatnam port: 36 నెలల్లో రామాయపట్నం ఓడరేవు.. ఏపీ, తెలంగాణ వాణిజ్యానికి కీలకంగా మారనున్న పోర్టు