HCL Recruitment 2021: హిందూస్థాన్ కాప‌ర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు నేడే చివ‌రి తేదీ..

HCL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ కాప‌ర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్‌)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మ‌ల‌జ్‌కంద్‌లో ఉన్న ఈ సంస్థ‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం...

HCL Recruitment 2021: హిందూస్థాన్ కాప‌ర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు నేడే చివ‌రి తేదీ..
Hindustan Copper Limited Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 15, 2021 | 6:11 AM

HCL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ కాప‌ర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్‌)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మ‌ల‌జ్‌కంద్‌లో ఉన్న ఈ సంస్థ‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 21 పోస్టుల కోసం చేప‌ట్ట‌నున్న ఈ రిక్రూట్‌మెంట్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ నేటితో (15-06-2021) ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌తలు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా ఎలక్ట్రీషియన్‌ గ్రేడ్, ఎలక్ట్రీషియన్‌ కమ్‌ లైన్‌మెన్‌ గ్రేడ్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఎల‌క్ట్రీషియ‌న్ గ్రేడ్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. ఐటీఐ(ఎలక్ట్రీషియన్‌), ఎన్‌సీవీటీ ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా వైర్‌మెన్ లైసెన్స్‌తో పాటు 3ఏళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

* ఎలక్ట్రీషియన్‌ కమ్‌ లైన్‌మెన్ ట్రేడ్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. ఐటీఐ( ఎలక్ట్రీషియన్‌), ఎన్‌సీవీటీ ఉత్తీర్ణులవ్వాలి. వైర్‌మెన్‌ లైసెన్స్‌తో పాటు కనీసం 3ఏళ్ల అనుభవం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఎల‌క్ట్రీషియ‌న్ గ్రేడ్ ఉద్యోగాల‌కు ఎంపికైన వారికి నెలకు రూ.18,180–రూ.37,310 జీతంగా చెల్లిస్తారు.

* ఎలక్ట్రీషియన్‌ కమ్‌ లైన్‌మెన్ ట్రేడ్ ఉద్యోగాల‌కు ఎంపికై వారికి నెల‌కు రూ. రూ.18,180–రూ.37,310 చెల్లిస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ నేటితో (15-06-2021) ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Indian Army Exam Cancel: భారత సైన్యంలో ప్రవేశానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వాయిదా..

UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే

ILBS Recruitment 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ అండ్ బిలియ‌రీ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. 90 ఖాళీలు, ఎవ‌రు అర్హులంటే..