Group-1 అభ్యర్థుల్లో మళ్లీ అదే టెన్షన్.. జీవో 29పై విచారణ వాయిదా.. ఏం జరగబోతుంది
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29 పై విచారణను హైకోర్టు నవంబర్ 26 కు వాయిదా వేసింది. తెలంగాణలో ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి.. పరీక్షలు ముగిసిన సరే జీవో 29 రద్దు కోరుతూ ఇంకా అభ్యర్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29 పై విచారణను హైకోర్టు నవంబర్ 26 కు వాయిదా వేసింది. తెలంగాణలో ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి.. పరీక్షలు ముగిసిన సరే జీవో 29 రద్దు కోరుతూ ఇంకా అభ్యర్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయితే, తాజాగా బుధవారం హైకోర్టులో జీవో 29 పై విచారణ జరగాల్సి ఉండగా.. ధర్మాసనం మళ్లీ విచారణను వాయిదా వేసింది.. ఇప్పటికే.. గ్రూప్ 1 పరీక్షలు ముగిసినా జీవో 29 పై తేలకుండా ఫలితాలు వెల్లడించవద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈరోజు హైకోర్టులో జరిగే విచారణపై అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
జీవో 29 పై తేలకుండానే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిందని ఇప్పటికే అనేక మంది అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు.. అక్టోబర్ నెలలో అభ్యర్థుల ఆందోళనల నడుమనే ప్రభుత్వం మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. పరీక్షలు రద్దు కోరుతూ గతంలోనే అభ్యర్థులు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. చివరి నిమిషంలో సుప్రీంకోర్టును ఆశ్రయించినందున తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టులోనే తేల్చుకోవాలని అభ్యర్థులకు స్పష్టం చేసింది. దీంతో బుధవారం జీవో 29 పై హైకోర్టులోనే తమకు న్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేసారు. అయితే దీనికి సంబంధించిన విచారణ ఈ నెల 26 కు హై కోర్టు వాయిదా వేసింది.
Telangana GO 29: అసలేంటి జీవో 29.. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలకు కారణం అదేనా..?
రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న జీవో 29 పై రాజకీయ రగడ సైతం తార స్థాయికి చేరింది. పరీక్షలు మొదలయ్యే సమయంలో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29 ద్వారా అణగరిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన చేసిన అభ్యర్థులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు సైతం ఉద్యమించాయి. అన్ని ఆందోళనల నడుమ మెయిన్స్ పరీక్షలు ప్రభుత్వం సజావుగా నిర్వహించింది. దీంతో ఇక తమ ఆశలన్నీ హైకోర్టు పైనే పెట్టుకున్నారు అభ్యర్థులు. జీవో 29 పై గత కొన్ని నెలలుగా అభ్యర్థులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు పరీక్షలు కూడా ముగియటతో జీవో 29 పై హైకోర్టు ఏం చెప్తుంది అనే ఉత్కంఠతో అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..