Success Story: నేటి యువతకు స్పూర్తి ఈ యువతి.. కేరళ తొలి ఆదివాసీ ఎయిర్ హోస్టెస్ గోపిక గురించి తెలుసా..
కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. కృషి పట్టుదలతో తాము కన్నకలలను నిజం చేసుకుంటారు కొందరు. అలా స్పుర్తిదాయకమైన యువతి గురించి ఈ రోజు తెలుసుకుందాం.. తల్లిదండ్రులు కూలీలు, కూతురు తన కలను సాకారం చేసుకుంది. సామాన్య యువతి ఎయిర్ హోస్టెస్‌గా మారిన కథ తెలుసుకుందాం. కేరళకు చెందిన గోపికా గోవింద్ కష్టపడి, దృఢ సంకల్పంతో ఎయిర్ హోస్టెస్ కావాలనే తన కలను నెరవేర్చుకుంది. ఆర్థిక సవాళ్లతో పోరాడుతూ..తన కలను వదులుకోలేదు. రెండవ ప్రయత్నంలోనే విజయం సాధించింది.

మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, మొత్తం విశ్వం మీకు ఎదురు తిరిగినా కృషి పట్టుదల విడకుండా కలను నెరవేర్చుకునేందుకు నిరంతరం కష్టపడుతూ ఉంటుంది. అలా ఒక కూలీ కూతురు నిరంతరం శ్రమ పడింది. గోపికా గోవింద్ కథ విన్న వారెవరైనా ఆమె దృఢ సంకల్పాన్ని, కృషిని ప్రశంసించకుండా ఉండలేరు. గోపిక ఎయిర్ హోస్టెస్ కావాలనే తన కలను నెరవేర్చుకుంది.
గోపికా గోవింద్ కేరళ నివాసి. రాష్ట్రానికి మొట్టమొదటి గిరిజన ఎయిర్ హోస్టెస్‌గా చరిత్ర సృష్టించింది. ఇది ఆమె సాదించిన గొప్ప విజయం మాత్రమే కాదు. కేరళకు కూడా గర్వకారణం. గోపిక కేరళలోని అలకోడ్ సమీపంలోని కావున్‌కుడిలోని ఎస్టీ కాలనీలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు పి. గోవిందన్, వి.జి. .. రోజువారీ కూలీగా పనిచేసేవారు. గోపికా కరింబల గిరిజన సమాజానికి చెందిన యువతి. ఆమె బాల్యం ఆర్థిక ఇబ్బందులుతో.. అరకొర సదుపాయాలతో నిండి ఉంది. అయినప్పటికీ ఆమె తన కలను ఎప్పుడూ వదులుకోలేదు. తన కలను నెరవేర్చుకునేందుకు కష్టపడి పనిచేయడం మొదలు పెట్టింది.
ప్రయాణం సులభం కాదు
అయితే గోపిక ప్రయాణం అంత సులభం కాదు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. గోపిక మరింత ఆచరణాత్మక మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. బి.ఎస్సీ కెమిస్ట్రీ చేసింది. తరవాత తన కలను సాధించే దిశగా అడుగులు మొదలు పెట్టింది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక రోజు వార్తాపత్రికలో ఎయిర్ హోస్టెస్ యూనిఫాం ధరించిన క్యాబిన్ క్రూ సభ్యురాలి చిత్రం ఆమె కలను తిరిగి రేకెత్తించింది. దీని తరువాత.. గోపిక విమానయాన రంగంలో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది.
రెండో ప్రయత్నంలోనే విజయం
గోపిక వయనాడ్‌లోని కల్పేటలో ఉన్న డ్రీమ్ స్కై ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీలో ఒక సంవత్సరం డిప్లొమా కోర్సులో చేరింది. అలా కోర్సు చేస్తున్న సమయంలో పలు ఇంటర్వ్యూలకు వెళ్ళింది. అయితే గోపిక మొదటి ప్రయత్నంలోనే ఎంపిక అవ్వలేకపోయింది. అయినప్పటికీ గోపిక తన ఆశను వదులుకోలేదు. రెండవ ప్రయత్నంలో విజయం సాధించింది. మూడు నెలల శిక్షణ తర్వాత గోపిక కన్నూర్ నుంచి గల్ఫ్ దేశానికి వెళ్ళే విమానంలో తన మొదటి ప్రయాణం చేసింది.
ఈ విజయం గోపికకు వృత్తిపరమైన మైలురాయి మాత్రమే కాదు. గిరిజన , వెనుకబడిన వర్గాల యువతులకు కూడా ప్రేరణగా నిలిచింది. గోపిక ‘నీకు ఒక కల ఉంటే దానిని నిర్భయంగా నెరవేర్చుకో.’ దాన్ని సాధించగలననే నమ్మకం కూడా మీకు ఉండాలి.. ఆ నమ్మకం మనకు లేకపోతె మనం ఎక్కడికీ చేరుకోలేమని చెబుతోంది. గోపిక సాధించిన ఈ విజయం ఆమెకు మాత్రమే కాదు.. జీవితంలో పెద్ద కలలు కనే అమ్మాయిలందరికీ స్ఫూర్తిదాయకం. దృఢ సంకల్పం ఉంటే ఏ కల కూడా అసాధ్యం కాదని గోపిక సాధించిన విజయం తెలియజేస్తుంది.
మరిన్ని హ్యూమన్ ఇంటరెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..