AP Inter Supply Exam Date 2025: ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్.. అడ్వాన్సడ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే..
ఇంటర్మీడియట్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు స్పష్టత ఇచ్చింది. ఏపీ ఇంటర్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయని ఇంటర్ బోర్డు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అలాగే.. మధ్యాహ్నం 02:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.

AP Inter Supplementary Time Table: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.. ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బోర్డు అధికారులతో కలిసి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10.5 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.. ఇంటర్ లో మొదటి సంవత్సరం 70శాతం మంది ఉత్తిర్ణత సాధించగా.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం 83శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు మరో కీలక ప్రకటనను విడుదల చేసింది.. అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షలపై స్పష్టత ఇచ్చింది. ఏపీ ఇంటర్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయని ఇంటర్ బోర్డు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అలాగే.. మధ్యాహ్నం 02:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల కోసం విద్యార్థులు.. పరీక్ష ఫీజును ఈ నెల 15 నుంచి 22 వరకు చెల్లించవచ్చు.. చెల్లించాలి. ఈ క్రమంలో 12 నుంచి 20 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇంటర్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనుండగా .. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి.
రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కోసం..
రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్ ఫీజు (IPE మార్చి 2025): ఏప్రిల్ 13, 2025 నుంచి ఏప్రిల్ 22, 2025 వరకుగా అధికారులు తెలిపారు.
ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నిరాశ చెందొద్దు.. నారా లోకేష్
పరీక్షా ఫలితాల విడుదల అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు నిరాశ చెందవద్దని, వచ్చే నెలలో నిర్వహించనున్న సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని, స్కోర్ చేయడానికి మళ్లీ ప్రిపేర్ అయి మంచి మార్కులతో పాస్ కావాలని ఆకాంక్షించారు.
🚨 Results for the Intermediate Public Examinations are now out. 🚨
Students can check their results online at https://t.co/UDtk11bzit. Also, results can be accessed by sending a “Hi” message to the Mana Mitra WhatsApp number at 9552300009.
Glad to share that this year’s IPE… pic.twitter.com/Ty2hpGkRiV
— Lokesh Nara (@naralokesh) April 12, 2025
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.