AP Inter Results 2025: ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్.. చివరి స్థానంలో ఏయే జిల్లాలు ఉన్నాయంటే.. డైరెక్ట్ రిజల్ట్ లింక్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.. ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పరీక్షలు రాసిన విద్యార్ధులు ఈ కింది టీవీ9 తెలుగు వెబ్‌సైట్ లింకు ద్వారా డైరెక్టుగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10.5 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.. ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పరీక్షలు రాసిన విద్యార్ధులు ఈ కింది టీవీ9 తెలుగు వెబ్‌సైట్ లింకు ద్వారా డైరెక్టుగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10.5 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.. పరీక్షా ఫలితాలను విడుదల చేసిన విద్యా శాఖామంత్రి లోకేష్ .. ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాలు గత దశాబ్దంలో అత్యధిక పాస్ శాతంతో వెలువడడం గర్వంగా ఉందన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం 70శాతం మంది ఉత్తిర్ణత.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం 83శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా 93 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. 73 శాతంతో చివరి స్థానంలో అల్లూరి, అనకాపల్లి జిల్లాలు నిలిచాయి..
ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్ ను ఇక్కడ చెక్ చేసుకోండి..
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల్లో గణనీయమైన వృద్ధి కనిపించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2వ సంవత్సరం పాస్ శాతం 69% కి చేరింది.. ఇది గత 10 ఏళ్లలో అత్యధికం. మొదటి సంవత్సరం పాస్ శాతం 47%గా ఉంది.. ఇది గత దశాబ్దంలో రెండవ అత్యధిక శాతం.
ఈ విజయం విద్యార్థులు, జూనియర్ లెక్చరర్లు, ప్రతీ ఒక్కరి కృషికి ఉదాహరణ అని లోకేష్ పేర్కొన్నారు. ఈసారి విజయాన్ని సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందొద్దని.. మరింత కృషి చేసి, మరింత బలంగా తిరిగివచ్చేలా ప్రయత్నించండి.. అని సూచించారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. మీరు నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ, విజయాలను సాధిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.. అని లోకేష్ పేర్కొన్నారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 26 జిల్లాల్లో మొత్తం 1535 కేంద్రాల్లో జరిగాయి.. దాదాపు 10,58,892 మంది విద్యార్ధులు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు హాజరయ్యాయి.. పరీక్షలు పూర్తైన కేవలం 20 రోజుల్లోనే మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేసిన ఇంటర్ బోర్డు.. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా సరిగ్గా ఏప్రిల్ 12వ తేదీన ఫలితాలను విడుదల చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.