Visa Rules Changed : విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఆ దేశం విసా నిబంధనలను సడలించిందోచ్చ్..!

స్టడీ వీసాల జారీలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా వర్క్ వీసాల జారీలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత చాలా దేశాలు వీసా నిబంధనలు కఠినతరం చేశాయి. ఆ దేశంలో నిరుద్యోగాన్ని ఎదుర్కోడానికి వర్క్ వీసాల జారీని కఠితరం చేశాయి. దీంతో విదేశాల్లో స్థిరపడాలని ప్లాన్ చేసుకునే వారికి నిబంధనలు చుక్కలు చూపిస్తున్నాయి.

Visa Rules Changed : విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఆ దేశం విసా నిబంధనలను సడలించిందోచ్చ్..!
Work Abroad
Follow us
Srinu

|

Updated on: Apr 02, 2023 | 6:30 PM

చాలా మందికి విదేశాల్లో పని చేస్తూ స్థిరపడాలని ఉంటుంది. కొంతమందైతే అదే పనిగా వివిధ దేశాల వీసాల కోసం అప్లై చేస్తూ ఉంటారు. అయితే ఆయా దేశాల వీసాల నిబంధనల కారణంగా ప్రతిసారి రిజెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా విదేశాలు వారి దేశంలో చదువుకోడంతో పాటు పని చేయడానికి కూడా ఎక్కువగా వీసాలు మంజూరు చేస్తాయి. అయితే స్టడీ వీసాల జారీలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా వర్క్ వీసాల జారీలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత చాలా దేశాలు వీసా నిబంధనలు కఠినతరం చేశాయి. ఆ దేశంలో నిరుద్యోగాన్ని ఎదుర్కోడానికి వర్క్ వీసాల జారీని కఠితరం చేశాయి. దీంతో విదేశాల్లో స్థిరపడాలని ప్లాన్ చేసుకునే వారికి నిబంధనలు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఇలాంటి వారికి డెన్మార్క్ దేశం శుభవార్త చెప్పింది. వీసా నిబంధనలు సులభతరం చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఆ దేశంలో ఎదుర్కొంటున్న కార్మికుల కొరతను ఎదుర్కోడానికి వర్క్ వీసా నిబంధనలను సడలించింది. ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.

డెన్మార్క్ దేశం ప్రస్తుతం కార్మికుల కొరతను ఎదుర్కొంటుంది. దేశంలో దాదాపు 42 శాతం కంపెనీలు 2022 మొదటి త్రైమాసికంలో రిక్రూట్‌మెంట్ ఇబ్బందులను నివేదించాయి. దీంతో కార్మికుల కొరతను అధిగమించే ప్రయత్నంలో భాగంగా అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించేందుకు డెన్మార్క్ తన ఇమ్మిగ్రేషన్ నిబంధనలను సడలించింది. ముఖ్యంగా వర్క్ పర్మిట్ ఫాస్ట్-ట్రాక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని వల్ల కంపెనీలు ఈయూ యేతర కార్మికులను నియమించుకోవడం సులభం అవుతుంది.  ఈ చర్యల వల్ల ముఖ్యంగా డెన్మార్క్‌లో చదువుతున్న విదేశీ విద్యార్థులు తమ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాన్ని అన్వేషించుకునే సమయం పెరుగుతుంది. ఈ నిబంధనలు మార్చి 23న ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది. దీంతో శనివారం నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సైన్స్, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్, టీచింగ్, ఐటీ, ఫైనాన్స్ రంగంలో అసోసియేట్ ప్రొఫెషనల్స్, క్లర్క్‌ వంటి నియామకాలపై దృష్టి పెడుతుంది. మెటల్, మెషినరీ, బిల్డింగ్, ట్రేడ్‌ వంటి రంగాల్లో ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఆరు నెలలకు బదులుగా రెండు సంవత్సరాల అమల్లో ఉంటాయి. 

కీలక మార్పులు ఇవే

డెన్మార్క్ విదేశీ పౌరులకు మరిన్ని ఉద్యోగాలు కల్పించడానికి వారు పని, నివాస అనుమతుల కోసం వేతన పరిమితిని తగ్గిస్తుంది. దీని వలన ఎక్కువ మంది వ్యక్తులు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదనంగా విదేశీయులను నియమించుకోవాలనుకునే కంపెనీల కోసం ఫాస్ట్-ట్రాక్ సర్టిఫికేషన్ ప్రక్రియ 20 మందికి బదులుగా 10 మంది పూర్తి-సమయ ఉద్యోగులను మాత్రమే చేర్చడానికి విస్తరిస్తున్నారు. ఈ మార్పు డెన్మార్క్‌లో పని చేయడానికి వచ్చే విదేశీ పౌరులకు మరిన్ని అవకాశాలను కల్పిస్తాయి. డెన్మార్క్‌లో కొత్త వ్యాపారాన్ని స్థాపించాలనుకునే వ్యాపారవేత్తలను  ఆకర్షించడానికి వివిధ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..