AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. హాల్‌ టికెట్ చూపిస్తే ఉచితంగా ప్రయాణం.

తెలంగాణలో రేపు (సోమవారం) జరగనున్న పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,94,620 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 2652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు...

Telangana: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. హాల్‌ టికెట్ చూపిస్తే ఉచితంగా ప్రయాణం.
Ts 10th Exams
Narender Vaitla
|

Updated on: Apr 02, 2023 | 6:29 PM

Share

తెలంగాణలో రేపు (సోమవారం) జరగనున్న పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,94,620 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 2652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఇందులో భాగంగానే పరీక్షా కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు, కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధికారులకు తెలిపారు.

ఉచిత ప్రయాణం..

ఇదిలా ఉంటే పదో తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకోసం విద్యార్థులు తమ హాల్‌ టికెట్లున చూపిస్తే సరిపోతుంది. ఇదిలా ఉంటే ఈసారి పరీక్ష పేపర్లను ఆరుకి తగ్గించారు. ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:30 వ‌ర‌కు పరీక్షలు జరగనున్నాయి.

ఎగ్జామ్‌ షెడ్యూల్‌..

* ఏప్రిల్ 3 – ఫ‌స్ట్ లాంగ్వేజ్

ఇవి కూడా చదవండి

* ఏప్రిల్ 4 – సెకండ్ లాంగ్వేజ్

* ఏప్రిల్ 6 – థ‌ర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్‌)

* ఏప్రిల్ 8 – గ‌ణితం

* ఏప్రిల్ 10 – సామాన్య శాస్త్రం (ఫిజిక్స్, బ‌యాల‌జీ)

* ఏప్రిల్ 11- సాంఘిక శాస్త్రం

* ఏప్రిల్ 12 – ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-1

* ఏప్రిల్ 13 – ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-2

విద్యార్థులకు సూచనలు..

* పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పౌష్టికాహారం లైట్ గా తీసుకోండి.

* సమయానికి కాకుండా కొంచెం ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.

* ఎలాంటి ఒత్తిడి లేకుండా ముందుగా వచ్చిన ప్రశ్నాలను రాయండి.

* హాల్‌ టికెట్‌ నెంబర్‌ సరిగ్గా ఎంటర్‌ చేశారో లేదో ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోండి.

* తప్పులు,కొట్టివేతలు లేకుండా చూసుకోండి.

* చివరి 15 నిమిషాలు ఆన్సర్‌ పేపర్‌ను ఓ సారి తిరిగేయండి.

* పరీక్షల ఒత్తిడి దరిచేరకుండా మెడిటేషన్‌, యోగా వంటివి చేయండి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..