Google: ఉద్యోగులకు మరో షాక్‌ ఇచ్చిన గూగుల్‌.. ఖర్చు తగ్గించుకునేందుకు ఈసారి ఏం చేసిందంటే.

ఆర్థికమాంద్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. బడా కంపెనీలు సైతం నిర్ధాక్షణ్యంగా ఉద్యోగులను తొలగించాయి. అప్పటి వరకు లక్షల్లో జీతాలు తీసుకున్న వారు కూడా ఉన్నపలంగా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది...

Google: ఉద్యోగులకు మరో షాక్‌ ఇచ్చిన గూగుల్‌.. ఖర్చు తగ్గించుకునేందుకు ఈసారి ఏం చేసిందంటే.
Google
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 02, 2023 | 7:02 PM

ఆర్థికమాంద్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. బడా కంపెనీలు సైతం నిర్ధాక్షణ్యంగా ఉద్యోగులను తొలగించాయి. అప్పటి వరకు లక్షల్లో జీతాలు తీసుకున్న వారు కూడా ఉన్నపలంగా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇలా ఉద్యోగులను తొలగించిన బడా కంపెనీల్లో గూగుల్‌ కూడా ఒకటి. ఈ ప్రపంచ దిగ్గజ సంస్థ ఏకంగా 12000 మందిని ఇంటికి పంపించిన విషయం తెలిసిందే. ఖర్చును తగ్గించుకునే క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించినట్లు గూగుల్‌ అప్పట్లో తెలిపింది.

ఇదిలా ఉంటే ఖర్చుల నియంత్రణలో భాగంగా ఈ దిగ్గజ సెర్చ్‌ ఇంజన్‌ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఉద్యోగుల జోలికి వెళ్లని గూగుల్‌ ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాలపై కోత పెట్టింది. గూగుల్‌ ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాల విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు స్నాక్స్‌, మీల్స్‌ వంటివి అందిస్తుంది. అయితే తాజాగా వీటిలో కోత పెట్టేందుకు గూగుల్ నిర్ణయం తీసుకుంది. ఖర్చుల నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ మేరకు గూగుల్‌ ఛీఫ్‌ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. ఇకపై ఉద్యోగులకు ఇచ్చే స్నాక్స్‌, లాండ్రీ సర్వీస్‌, మధ్యాహ్న భోజనాల వంటి వాటిని ఆపేయాలని గూగుల్‌ నిర్ణయించింది. ఇదిలా ఉంటే కాస్ట్ కంట్రోలింగ్‌లో భాగంగా కొత్త ఉద్యోగుల నియామకాలను సైతం గూగుల్‌ ఆపేసింది. మరి గూగుల్‌ ఇంతటితో ఆగుతుందా మళ్లీ ఉద్యోగుల తొలగింపు దిశగా అడుగులు వేస్తుందా చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!