AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Group 2: గ్రూప్‌ 2 అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు

లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టీఎస్‌పీఎస్సీతో సంప్రదించి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. భవిష్యత్తులో కూడా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లు సరిగ్గా ఉండేలా చూడాలని చీఫ్ సెక్రటరీకి ఆయన సలహా ఇచ్చారు. అలాగే అభ్యర్థులందరికీ అర్హత ఉన్న అన్ని పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన సమయం లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు' అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు మంత్రి కేటీఆర్

TSPSC Group 2: గ్రూప్‌ 2 అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు
Tspsc Group 2 Exams
Basha Shek
|

Updated on: Aug 13, 2023 | 12:55 AM

Share

తెలంగాణ న్యూస్, ఆగస్టు 11: గ్రూప్‌ 2 పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులకు నష్టం జరగకుండా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తో సంప్రదింపులు జరిపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. భవిష్యత్ లో కూడా అభ్యర్థులు అన్ని పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా సరైన సమయం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు సూచించారని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టీఎస్‌పీఎస్సీతో సంప్రదించి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. భవిష్యత్తులో కూడా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లు సరిగ్గా ఉండేలా చూడాలని చీఫ్ సెక్రటరీకి ఆయన సలహా ఇచ్చారు. అలాగే అభ్యర్థులందరికీ అర్హత ఉన్న అన్ని పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన సమయం లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు మంత్రి కేటీఆర్ . సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో గ్రూప్‌ 2 పరీక్షల రీ షెడ్యూల్‌పై సీఎస్‌ శాంతికుమారి టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శితో చర్చించారు. ఈనెల 29, 30న జరగాల్సిన పరీక్షలను నవంబర్‌కు వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు ప్రకటించారు.

వీడిన ఉత్కంఠ.. నవంబర్ లోనే పరీక్షలు..

కాగా గత కొద్ది రోజులుగా గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం ఈనెల 29, 30 తేదీల్లో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1539 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైది. ఇందుకోసం స్కూళ్లు, కాలేజీలకు సైతం సెలవులు ప్రకటించింది. పలు రాజకీయ పార్టీలు కూడా గ్రూప్‌ 2 అభ్యర్థుల ఆందోళనకు మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్‌ 2 పరీక్షలు వాయిదా వేయాలని టీఎస్‌పీఎస్సీకి సూచించారు.

ఇవి కూడా చదవండి

మంత్రి కేటీఆర్ ట్వీట్

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.