EPIL Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.50 వేల జీతం..

భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌.. అసిస్టెంట్‌ మేనేజర్‌, మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

EPIL Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.50 వేల జీతం..
EPIL Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 15, 2022 | 7:44 AM

భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌.. 11 అసిస్టెంట్‌ మేనేజర్‌, మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఫైనాన్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 2 నుంచి 4 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 32 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 29, 2022వ తేదీలోపు దరఖాస్తులు పంపించవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.40,000ల నుంచి రూ.50,000ల వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌..

North Eastern Regional Office – Guwahati.

ఇవి కూడా చదవండి

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.