AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DCCB Recruitment: ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా స్టాఫ్‌ అసిస్టెంట్‌/ క్లర్క్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

DCCB Recruitment: ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Eluru Dccb Jobs
Narender Vaitla
|

Updated on: Nov 06, 2022 | 8:39 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా స్టాఫ్‌ అసిస్టెంట్‌/ క్లర్క్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా 95 స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు ఇంగ్లిష్‌, తెలుగు భాషలు, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు అక్టోబర్ 1, 2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్/ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 17,900 నుంచి రూ. 47,920 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 20-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* ఆన్‌లైన్‌ పరీక్షను ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహిస్తారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..