DMHO Recruitment: నెల్లూరులో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
నెల్లూరులోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
నెల్లూరులోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 26 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో మెడికల్ ఆఫీసర్ (25), ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ (01) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైణ్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి కార్యాలయం, నెల్లూరు చిరునామాకు పంపించాలి.
* అభ్యర్థులను అకడమిక్‌లో సాధించిన మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంవో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 53,495, ఎఫ్‌సీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 50,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 12-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..