Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలువులు పొడగించారా.? క్లారిటీ ఇచ్చిన విద్యా శాఖ.

దాదాపు నెలన్నర రోజుల పాటు వేసవి సెలవుల్లో ఉన్న విద్యార్థులు తిరిగి పాఠశాల బాట పట్టనున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం పాఠశాలల రీఓపెనింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎండల తీవ్రత తగ్గకపోవడంతో వారం రోజుల పాటు ఒక్క పూట బడి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే...

Telangana: తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలువులు పొడగించారా.? క్లారిటీ ఇచ్చిన విద్యా శాఖ.
TS Schools
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 12, 2023 | 6:51 AM

దాదాపు నెలన్నర రోజుల పాటు వేసవి సెలవుల్లో ఉన్న విద్యార్థులు తిరిగి పాఠశాల బాట పట్టనున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం పాఠశాలల రీఓపెనింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎండల తీవ్రత తగ్గకపోవడంతో వారం రోజుల పాటు ఒక్క పూట బడి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణలోనూ వేసవి సెలవులు పొడగించారంటూ ఉత్తర్వులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో దీనిపై తెలంగాణ విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. స్కూళ్లకు సెలవులు పొడిగిస్తున్నారనే తప్పుడు వార్తలు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న నకిలీ ఉత్తర్వులు నమ్మొద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. పాఠశాలలకు వేసవి సెలవుల పొడిగింపు లేదని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం (12వ తేదీ) నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దీంతో గత రెండు రోజులుగా సర్క్యూలేట్‌ అవుతోన్న ఫేక్‌ న్యూస్‌కి చెక్‌ పడినట్లైంది.

ఇదలా ఉంటే పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. 13న తొలిమెట్టు, 14న సామూహిక అక్షరాభ్యాసం, 15న ప్రత్యేక అవసరాల పిల్లలకు కార్యక్రమాలు, 16న ఆంగ్ల మాధ్యమంపై అవగాహన, 17న బాలికా విద్యతోపాటు కెరీర్‌ గైడెన్స్‌, 19న తెలంగాణ గ్రీన్‌ ఫెస్టివల్‌, 20వ తేదీన విద్యా దినోత్సవం నిర్వహించనున్నారు.

తెలంగాణ దశాబ్ధి ఉత్సావాల్లో భాగంగా ఈ నెల 20న తెలంగాణ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిభ కనబరిచిన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతోపాటు పిల్లలు సక్రమంగా పాఠశాలకు రావడంలో సహకరిస్తున్న తల్లిదండ్రులు, ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరిస్తారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నోట్‌, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లను విద్యార్థులకు అందించనున్నారు. అలాగే రాగిజావ కార్యక్రమాన్ని 20వ తేదీన ప్రారంభించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..