Andhra pradesh: నేడు పల్నాడులో సీఎం జగన్ పర్యటన.. విద్యాకానుకను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం పల్నాడులో పర్యటించనున్నారు. నేడు ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ విద్యాకానుకను ప్రారంభించనున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో సీఎం ఈ కార్యక్రమాన్ని లాంచనంగా...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం పల్నాడులో పర్యటించనున్నారు. నేడు ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ విద్యాకానుకను ప్రారంభించనున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో సీఎం ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించనున్నారు. బడులు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక ఇవ్వనుండడం విశేషం. ఇదిలా ఉంటే ఏపీలో ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ వరకు ఒంటి పూట బడి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక విద్యా కానుకలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 43,10,165 స్టూడెంట్స్‌కి పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ. 1,042.53 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రతీ విద్యార్థికి ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు అందించనున్నారు. విద్యా కానుకలో భాగంగా నోట్ బుక్‌లు, వర్క్ బుక్‌లు, 3 జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగును అందిస్తారు.
వీటితో పాటు 6-10 తరగతి పిల్లలకు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ, 1-5 తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ ఇవ్వనున్నారు. జగనన్న విద్యాకానుక కిట్‌కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) తో సహా 4 దశల్లో నాణ్యతా పరీక్షలు నిర్వహించారు. జగనన్న విద్యా కానుకలో భాగంగా ప్రభుత్వం ప్రతి విద్యార్థికీ సుమారు రూ.2,400ల విలువైన కిట్‌ను అందించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..