Andhra Pradesh Schools: చాక్‌పీస్‌, బ్లాక్‌ బోర్డుకు గుడ్‌బై.. సర్కార్‌ బడుల్లోనూ డిజిటల్ బోధన విధానం!

ఏపీ ప్రభుత్వ బడుల్లో చాక్‌పీస్‌లకు గుడ్ బై చెప్పే రోజులు వచ్చేశాయి. చాక్‌పీస్‌, బ్లాక్‌ బోర్డులతో పని లేకుండా ఇకపై పూర్తి స్థాయిలో డిజిటల్‌ బోధన అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకూ క్లాస్ రూమ్ లో టీచర్స్ బ్లాక్‌, గ్రీన్‌ బోర్డులను ఉపయోగిస్తూ పాఠాలు చెప్పేవారు. ఇక పై అలా కాకుండా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రైవేట్ బడులకు ధీటుగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్కూల్స్ లో బోధనా పద్ధతుల్లో సముల మార్పులు రానున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ బడులంటే సరైన మౌలిక వసతులే వుండవు అనే పరిస్థితి నుండి ప్రభుత్వ బడులంటేనే..

Andhra Pradesh Schools: చాక్‌పీస్‌, బ్లాక్‌ బోర్డుకు గుడ్‌బై.. సర్కార్‌ బడుల్లోనూ డిజిటల్ బోధన విధానం!
AP Schools Digitalization
Follow us
P Kranthi Prasanna

| Edited By: Srilakshmi C

Updated on: Nov 14, 2023 | 6:03 PM

విజయవాడ, నవంబర్ 14: ఏపీ ప్రభుత్వ బడుల్లో చాక్‌పీస్‌లకు గుడ్ బై చెప్పే రోజులు వచ్చేశాయి. చాక్‌పీస్‌, బ్లాక్‌ బోర్డులతో పని లేకుండా ఇకపై పూర్తి స్థాయిలో డిజిటల్‌ బోధన అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకూ క్లాస్ రూమ్ లో టీచర్స్ బ్లాక్‌, గ్రీన్‌ బోర్డులను ఉపయోగిస్తూ పాఠాలు చెప్పేవారు. ఇక పై అలా కాకుండా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రైవేట్ బడులకు ధీటుగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్కూల్స్ లో బోధనా పద్ధతుల్లో సముల మార్పులు రానున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ బడులంటే సరైన మౌలిక వసతులే వుండవు అనే పరిస్థితి నుండి ప్రభుత్వ బడులంటేనే ప్రత్యేకంగా మాట్లాడుకునే రోజులు రానున్నాయి.

ప్రైవేట్‌ పాఠశాలలతో పోల్చుకునే కాలం పోయి ప్రభుత్వ బడుల్లో కుడా సీట్ల కోసం క్యు కట్టే రోజులు రానున్నాయి. దీనంతటికీ కారణం చకచకా మారుతున్న డిజిటలైజేషన్ విధానమే.. ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూల్స్ లోనే లేని విధంగా ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌ డిస్‌ప్లే అంటే ఐఎఫ్‌పీడీలను ప్రభుత్వ పాఠశాలల్లో ఏపి ప్రభుత్వం తీసుకుని వచ్చిందీ. దీని ద్వారా బ్లాక్‌, గ్రీన్‌ బోర్డుల ద్వారా పాఠాలు చెప్పే విధానం పోయి స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌పీ డిస్‌ప్లేలను వినియోగించి చెప్పనున్నారు. ఇప్పటికే చాలా వరకు అందుబాటులోకి వచ్చిన ఈ విధానం ఇకపై పూర్తి స్థాయిలో మారనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠాశాలల్లో ఇప్పటికే 30,715 ఐఎఫ్‌పీలు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఈ డిసెంబర్ నాటికి మారో 32 వేల స్క్రీన్స్ తో కలిపి మొత్తం 62 వేల స్క్రీన్స్ అందుబాటులోకి రానున్నాయి. అలాగే ట్యాబ్ ల పంపిణీ కుడా 10 లక్షలకు చేరుతుంది.

దీంతో దేశంలోనే ప్రభుత్వ బడుల్లో పూర్తి స్థాయి టెక్నాలజీని అనుసరిస్తున్న రాష్ట్రంగా ఏపి నే ఉంటుంది. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభం లోనే 4,800 హై స్కూల్స్ లొ 6 నుండి 10 వ తరగతి క్లాసెస్ కు సెక్షన్ కు ఒకటి లెక్కన మొత్తం 30,715 ఐఎఫ్ పీ స్కిన్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రాథమిక స్కూల్స్ లొ 60 మెంబెర్స్ స్టూడెంట్స్ కు ఒక స్మార్ట్ టివి లెక్కన 10,038 టీవీలు రెండో దిశలో 32 వేల ఐఎఫ్‌పీ లు,22 వేల స్మార్ట్ టీవీ పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయి. వచ్చే నెలాఖరున పూర్తి స్థాయిలో అన్ని చోట్ల అందుబాటులోకి వచ్చే విధంగా అడుగులు పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..