Jobs: అలాంటి కంపెనీలపైనే యువత ఆసక్తి.. సర్వేలో ఆసక్తికర విషయాలు..
ఫ్రెషర్లు ఎక్కువగా.. ఇ-కామర్స్, టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్‌తో పాటు ఐటీ రంగాల్లో ఉద్యోగాలకు అధిక ప్రాధన్యం ఇస్తున్నారు. ప్రముఖ జాబ్ పోర్టల్ అప్నా.కామ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇక యువత ఇలాంటి కంపెనీల్లో చేరడానికి ఆసక్తిచూపించడానికి పలు కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి.. ఉద్యోగంలో గ్రోత్ అధికంగా ఉండడం, వర్క్ ఎన్విరాన్‌మెంట్, ఉద్యోగం-జీవితం మధ్య సమతుల్యత...
యువత ఆలోచనలో మార్పు వస్తోంది. ఏ ఉద్యోగం పడితే అది కాకుండా తమకు నచ్చిన ఉద్యోగం చేయాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా జీతంతో పాటు జీవితాన్ని కూడా ఆస్వాదించాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే తమ ఉద్యోగం ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఇలాంటి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ఫ్రెషర్లు ఎక్కువగా.. ఇ-కామర్స్, టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్‌తో పాటు ఐటీ రంగాల్లో ఉద్యోగాలకు అధిక ప్రాధన్యం ఇస్తున్నారు. ప్రముఖ జాబ్ పోర్టల్ అప్నా.కామ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇక యువత ఇలాంటి కంపెనీల్లో చేరడానికి ఆసక్తిచూపించడానికి పలు కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి.. ఉద్యోగంలో గ్రోత్ అధికంగా ఉండడం, వర్క్ ఎన్విరాన్‌మెంట్, ఉద్యోగం-జీవితం మధ్య సమతుల్యత పాటించే వీలు ఉండడమే ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
అప్నా.కామ్ నిర్వహించిన సర్వేలో తేలిన వివరాల ప్రకారం.. ఇ-కామర్స్ రంగాల్లోని ఉద్యోగాల కోసం దరఖాస్తులు 22 శాతం పెరిగాయి. బ్యాంకింగ్ వంటి ఆర్థికపరమైన రంగంలో 18 శాతం పెరగ్గా, టెలికమ్యూనికేషన్ రంగంలో 13 శాతం, ఐటీ రంగంలో 5 శాతం వృద్ధి ఉంది. ఈ సర్వేలో భాగంగా మొత్తం 10,000 మందిని పరిగణలోకి తీసుకున్నారు.
సూరత్, జయపుర, గ్వాలియర్, భోపాల్, ఇండోర్, లఖ్‌నవూ, కాన్పూర్ లాంటి టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో ప్రతీ 10 మందిలో ఆరుగురు ఇ-కామర్స్, బ్యాంకింగ్ రంగాలపై అత్యంత ఆసక్తితో ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక ఉద్యోగ స్థిరత్వంపై భరోసా ఉండే కంపెనీలకు 34 శాతం మంది ప్రాధాన్యమిస్తున్నారు. మంచి పేరున్న కంపెనీలపై 22 శాతం మొగ్గు చూపుతున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ జియో లాంటి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రతీ 10 మందిలో 8 మంది ఆసక్తి చూపిస్తున్నారు.
ఉద్యోగ భద్రత, కంపెనీకి ఉన్న మంచి పేరు, నేర్చుకునే అవకాశాలు ఉండటం ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఇక కేవలం ఇవే కాకుండా మంచి పని వాతావరణం, ఉద్యోగం- జీవితానికి మధ్య సమతుల్యత ఉండే పని ప్రదేశాలకు ప్రాధాన్యమిస్తామని 38 శాతం మంది తెలిపారు. ఇక కేవలం వర్క్ గ్రోత్ మాత్రమేకాకుండా, హెల్త్ కూడా ముఖ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..