CNP Recruitment: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. కరెన్సీ నోట్‌ ప్రెస్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..

CNP Recruitment 2022: కరెన్సీ నోట్‌ ప్రెస్‌ (సీఎన్‌పీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కి చెందిన ఈ సంస్థల్లో పలు విభాగాల్లో..

CNP Recruitment: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. కరెన్సీ నోట్‌ ప్రెస్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
Follow us

|

Updated on: Jan 07, 2022 | 7:00 PM

CNP Recruitment 2022: కరెన్సీ నోట్‌ ప్రెస్‌ (సీఎన్‌పీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కి చెందిన ఈ సంస్థల్లో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నాసిక్‌ రోడ్‌లోని ఈ సంస్థలో ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయన్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 149 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (01), సూపర్‌వైజర్లు (16), సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ (01), జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్లు (06), జూనియర్‌ టెక్నీషియన్లు (125) ఖాళీలు ఉన్నాయి.

* వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

* సూపర్‌వైజర్లు పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

* సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్, స్టెనోగ్రఫీ(ఇంగ్లిష్‌/హిందీ) ఉండాలి. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

* జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తో పాటు టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

* జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ప్రింటింగ్, మెకానికల్, ఎయిర్‌ కండిషనింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్, స్టెనోగ్రఫీ/టైపింగ్‌ స్పీడ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ 25-01-2022తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Rangamarthanda: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘రంగమార్తాండ’ మూవీ.. ప్రకాష్ రాజ్ లుక్ చూస్తే షాక్ అవుతారు.!.

Gangasagar Mela 2022: గంగాసాగర్ మేళాకు కోర్టు గ్రీన్ సిగ్నల్.. దీదీ ప్రభుత్వానికి కీలక సూచనలు..

Delhi: జైలు అధికారులను చూసి మొబైల్‌ ఫోన్‌ను మింగేసిన ఖైదీ.. ఆపై ఏం జరిగిందంటే..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..