IRFC Recruitment: ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

IRFC Recruitment: ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఢిల్లీలో ఉన్న ఈ సంస్థలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?

IRFC Recruitment: ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 07, 2022 | 2:52 PM

IRFC Recruitment: ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఢిల్లీలో ఉన్న ఈ సంస్థలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఫైనాన్స్‌, అడ్మిన్‌ విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేటర్, అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ దరఖాస్తులను జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌–అడ్మిన్‌), మూడో ఫ్లోర్, ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, ది అశోక్, డిప్లమాటిక్‌ ఎన్‌క్లేవ్‌:50–బి, చాణక్యపురి, న్యూఢిల్లీ–110021 అడ్రస్‌కు పంపించాలి.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,000 నుంచి రూ.74,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ 28-01-2022తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: PM Security Breach: అన్ని రికార్డులను భద్రపరచండి.. ప్రధాని మోడీ భద్రతలో లోపంపై సుప్రీం కోర్టు కీలక విచారణ..

NEET PG Counselling 2021: అడ్మిషన్ ప్రక్రియలో వేగం పెంచండి.. నీట్‌ పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

FASTag -Airtel Payments Bank: ఎయిర్‌టెల్‌ కొత్త సేవలు.. పార్కింగ్‌, కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ల్లో ఫాస్టాగ్‌.. !