Cochin shipyard jobs: కొచ్చిన్ షిప్ యార్డ్‌లో భారీగా అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (సిఎస్ఎల్)లో భారీగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 356 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు...
కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (సిఎస్ఎల్)లో భారీగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 356 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 256 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ (348), టెక్నీషియన్ అప్రెంటిస్ (8) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదోతరగతి, వి హెచ్ ఎస్ సి, ఐటిఐ – ఎన్ టి సి (సంబంధిత ట్రేడ్) పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు అక్టోబర్ 26 నాటికి 18 ఏళ్లు నిండాలి. నిబంధనల ఆధారంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విదానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 12-10-2022న మొదలవగా, 26-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..