IIM Indore Recruitment 2022: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో నాన్ టీచింగ్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనున్న ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. 22 లైబ్రేరియన్, చీఫ్ ఇంజినీర్, ఆఫీసర్ (సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్), జనరల్ డ్యూటీ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనున్న ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. 22 లైబ్రేరియన్, చీఫ్ ఇంజినీర్, ఆఫీసర్ (సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్), జనరల్ డ్యూటీ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, బీకాం, బీఈ/ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, సీఏ, ఎమ్మెస్సీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా అక్టోబర్ 26, 2022వ తేదీలోపు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- లైబ్రేరియన్ పోస్టులు: 1
- చీఫ్ ఇంజినీర్ పోస్టులు: 1
- ఆఫీసర్ (సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్) పోస్టులు: 1
- ఆఫీసర్ (నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్) పోస్టులు: 1
- ఆఫీసర్ పోస్టులు: 3
- ఆఫీసర్ (అకౌంట్స్) పోస్టులు: 1
- జనరల్ డ్యూటీ అసిస్టెంట్ పోస్టులు: 12
- జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (అకౌంట్స్) పోస్టులు: 2
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.




మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.