Navy’s MiG-29K Crashed Again: వరుసగా నాలుగోసారి పేలిన మిగ్-29 విమానం.. తృటిలో తప్పించుకున్న పైలట్!
ఇండియన్ నేవీకి చెందిన మిగ్-29కె విమానం ఈ రోజు గోవా సముద్ర తీరంలో కూలిపోయింది. విమానం బేస్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ టీం పైలట్‌ను..
ఇండియన్ నేవీకి చెందిన మిగ్-29కె విమానం ఈ రోజు గోవా సముద్ర తీరంలో కూలిపోయింది. విమానం బేస్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ టీం పైలట్‌ను రక్షించగలిగారు. స్వల్ప గాయాలతో బయటపడిన పైలట్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు నేవీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విమానం కూలిపోవడానిక గల కారణాలను తెలుసుకోవల్సిందిగా బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. లేటెస్ట్ టెక్నాలజీతో రష్యా తయారు చేసిన ఎమ్‌ఐజీ-29కె ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎజెక్షన్ సీటుతో రూపొందించారు. ఈ విమానాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. ఐతే ఎమ్‌ఐజీ-29కె విమానాలు కూలి పోవడం ఇది తొలిసారికాకపోవడం గమనార్హం. 2019 నుంచి ఇప్పవరకు నాలుగు సార్లు ఎమ్‌ఐజీ-29కె విమానాలు కూలిపోవడంతో పలు అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి.
మిగ్-29కె ట్రైనర్ విమానాలు కూలిపోవడం ఇది నాలుగో సారి..
- నవంబర్ 2019లో గోవాలో మిగ్-29కె ట్రైనర్ విమానం తొలిసారి కూలిపోయింది. ఈ ఘనలో ఇద్దరు పైలట్‌లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
- నవంబర్ 2020లో జరిగిన మిగ్-29కె విమాన ప్రమాదంలో ఓ పైలట్ మరణించగా, మరొక పైలట్‌ని రక్షించ గలిగారు. ప్రమాదం జరిగిన 11 రోజుల తర్వాత కమాండర్ నిశాంత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు.
- ఇక అదే ఏడాది ఫిబ్రవరిలో పక్షులు ఢీకొనడంతో మరో మిగ్-29 విమారం క్రాష్ అయ్యింది.