BPCL Jobs 2022: రాత పరీక్షలేకుండా.. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..పూర్తివివరాలివే..

భారత ప్రభుత్వ పెట్రోలియం అండ్‌ న్యాచురల్‌ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన కేరళ రాష్ట్రంలోని కొచ్చిలోనున్న భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. 57 టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌..

BPCL Jobs 2022: రాత పరీక్షలేకుండా.. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..పూర్తివివరాలివే..
Bharat Petroleum Corporation Limited
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 12, 2022 | 6:05 PM

భారత ప్రభుత్వ పెట్రోలియం అండ్‌ న్యాచురల్‌ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన కేరళ రాష్ట్రంలోని కొచ్చిలోనున్న భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. 57 టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కెమికల్ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్ ఇంజనీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌, అప్లైడ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అక్టోబర్‌ 1, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. అంటే దరఖాస్తుదారులు తప్పనిసరిగా అక్టోబర్‌ 1, 1995 నుంచి అక్టోబర్ 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్‌ 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల చొప్పున స్టైపెండ్‌ చెల్లి్స్తారు. అప్రెంటిస్‌ ట్రైనింగ్ ఏడాది పాటు ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.