TSPSC: గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. అక్టోబర్‌ 16న ఎగ్జాం..

తెలంగాణలో అక్టోబర్‌ 16న నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షపై టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్‌లతో..

TSPSC: గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. అక్టోబర్‌ 16న ఎగ్జాం..
TSPSC Chairman review Meeting
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 12, 2022 | 7:30 PM

తెలంగాణలో అక్టోబర్‌ 16న నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షపై టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్‌లతో సహా ఇతర అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పరీక్షకు సరిగ్గా మూడు రోజులే మిగిలుండగా అధికారులతో పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పరీక్ష సెంటర్ల ఏర్పాటు, అక్కడ పరిస్థితులపై చైర్మన్ బి జనార్దన్ ఈ సందర్భంగా ఆరా తీశారు. పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష నిర్వహణ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు సైతం జనార్దన్ అధికారులకు సూచించారు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌ 16న రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో 1019 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్‌ 1 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు 3.8లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.