UPSC Recruitment 2022: డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులు పొందే అవకాశం.. యూపీఎస్సీ తాజా నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాలు ఇవే..

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 52 సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1, సైంటిస్ట్ ‘బి’, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

UPSC Recruitment 2022: డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులు పొందే అవకాశం.. యూపీఎస్సీ తాజా నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాలు ఇవే..
UPSC Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 12, 2022 | 4:50 PM

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 52 సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1, సైంటిస్ట్ ‘బి’, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ(ఇంజినీరింగ్/ఆర్కిటెక్చర్, ఆయుర్వేదం, ఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సైన్సెస్), పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

అభ్యర్ధుల వయసు అక్టోబర్ 27, 2022 నాటికి సీనియర్ డిజైన్ ఆఫీసర్‌ పోస్టులకు 40 ఏళ్లు, సైంటిస్ట్‌కు 35 ఏళ్లు, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్/అసిస్టెంట్ ఆర్కిటెక్ట్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 30 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 45 ఏళ్లు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 27, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.25 అప్లి్కేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

ఇవి కూడా చదవండి
  • సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టులు: 1
  • సైంటిస్ట్ ‘బి’ పోస్టులు: 10
  • జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు: 1
  • అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ పోస్టులు: 13
  • అసిస్టెంట్ ప్రొఫెసర్(ఆయుర్వేదం) పోస్టులు: 1
  • డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు: 26

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!