ICSE, ISC Exam Dates 2021: పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన సీఐఎస్‌సీఈసీ బోర్డు.. ఎప్పటి నుంచి మొదలంటే..

CISCE Board Announce Exam Date 2021: కరోనా కారణంగా అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. కోవిడ్‌ అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే విద్యా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. లాక్‌డౌన్‌ కారణంతో..

ICSE, ISC Exam Dates 2021: పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన సీఐఎస్‌సీఈసీ బోర్డు.. ఎప్పటి నుంచి మొదలంటే..
Follow us

|

Updated on: Mar 02, 2021 | 7:18 PM

ICSE Board Announce Exam Date 2021: కరోనా కారణంగా అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. కోవిడ్‌ అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే విద్యా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. లాక్‌డౌన్‌ కారణంతో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. దీంతో పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. దేశంలోని అన్ని బోర్డులు తమ పరిధిలో జరిగే పరీక్షలను వాయిదా వేస్తూ వచ్చాయి. అయితే పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయి. కరోనా ప్రభావం తగ్గుతుండడంతో మళ్లీ అన్ని పనులు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ పరీక్షలు మొదలవుతున్నాయి. ఇప్పటికే సీబీఎస్‌ఈ 10, 12 పరీక్ష తేదీలను ప్రకటించగా.. ఆయా రాష్ట్రాల్లో ప్రవేశ పరీక్షల తేదీలు కూడా విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐసీఎస్ఈ(ICSE) సైతం టెన్త్‌ క్లాస్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సోమవారం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు మే 5 నుంచి ప్రారంభమై.. జూన్ 7తో ముగియనున్నాయి. ఇక ఐఎస్‌సీ పరీక్షలు జూన్‌ 16న ముగియనున్నాయి. ఈ మేరకు ‘ది కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌(సీఐఎస్‌ఈసీ) పరీక్షల షెడ్యూల్‌(Date sheet)ను కౌన్సిల్ సోమవారం విడుదల చేసింది. ఈ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. పూర్తివివరాలను https://www.cisce.org/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు. ఇక పరీక్ష ఫలితాలను జూలైలో విడుదల చేసే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక గతేడాది కరోనా విశ్వరూపం చూపించిన నేపథ్యంలో బోర్డు.. పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించారు.

Also Read: APSSDC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హెటిరో డ్రగ్స్‌లో 80 జాబ్స్‌.. హైదరాబాద్‌, వైజాగ్‌లో ఖాళీలు..

JEE Main 2021: జేఈఈ అభ్యర్థులు అలర్ట్‌.. ప్రారంభమైన రెండో దశ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ.. చివరి తేది ఎప్పుడంటే..

Fuel Efficient Cars: కారు కొనాలనుకుంటున్నారా.? మైలేజ్‌ కూడా కావాలా.? అయితే మీకు ఇవే బెస్ట్‌ ఆప్షన్‌..