SCCL Job Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. 10వ తరగతి అర్హతతో సింగరేణి లో ఉద్యోగావకాశాలు
ఎవరికైనా తమ చదువుకు, అర్హతకు తగిన ఉద్యోగం దొరకాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల వరసగా ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ.. నిరుద్యోగులకు ...
SCCL Job Notification : ఎవరికైనా తమ చదువుకు, అర్హతకు తగిన ఉద్యోగం దొరకాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల వరసగా ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది. తాజాగా సింగరేణి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 372 నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులని భర్తీ చేయనుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది ఫిబ్రవరి 27. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://scclmines.com/ లో చూడవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య : 372
ఫిట్టర్- 128, ఎలక్ట్రీషియన్- 51, వెల్డర్- 54, టర్నర్ లేదా మెషినిస్ట్ ట్రైనీ- 22, మోటార్ మెకానిక్ ట్రైనీ- 14, ఫౌండర్ మెన్ – 19, జూనియర్ స్టాఫ్ నర్స్- 84
విద్యార్హతలు: పోస్టులను బట్టి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పాస్ కావాల్సి ఉంది. ఇక జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి లేదా బీఎస్‌సీ నర్సింగ్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టి, ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ. 200
దరఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేది: 27 ఫిబ్రవరి 2021
అధికారిక వెబ్‌సైట్: https://scclmines.com/
అయితే జూనియర్ స్టాఫ్ నర్సు పోస్టులకు మహిళా అభ్యర్థులతో పాటు పురుషులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా సింగరేణి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also Read: నేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సం.. ఈ ఏడాది థీమ్, ప్రాముఖ్యత ఏమిటంటే..!
అందరి ముందు పెద్ద పంచాయతీ.. కార్తీక్ మూర్కుడు అని తేల్చేసిన తండ్రి.. ఉత్కంఠగా మారిన నేటి ఎపిసోడ్
ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!