AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam Serial : అందరి ముందు పెద్ద పంచాయతీ.. కార్తీక్ మూర్కుడు అని తేల్చేసిన తండ్రి.. ఉత్కంఠగా మారిన నేటి ఎపిసోడ్

అత్తాకోడళ్లు అమోఘమైన తెలివితేటలూ శిక్షపడింది నాకు .. మరి దీప అనుభవిస్తోంది ఏమిటి.. అని కుటుంబ సభ్యులను ప్రశిస్తాడు. మరి ఇది అనుభవిస్తోంది ఏంటి’ అని సౌందర్య నిలదియ్యడంతో..

Karthika Deepam Serial : అందరి ముందు పెద్ద పంచాయతీ.. కార్తీక్ మూర్కుడు అని తేల్చేసిన తండ్రి.. ఉత్కంఠగా మారిన నేటి ఎపిసోడ్
Surya Kala
|

Updated on: Mar 03, 2021 | 10:17 AM

Share

Karthika Deepam Serial : అత్తాకోడళ్లు అమోఘమైన తెలివితేటలూ శిక్షపడింది నాకు .. మరి దీప అనుభవిస్తోంది ఏమిటి.. అని కుటుంబ సభ్యులను ప్రశిస్తాడు. మరి ఇది అనుభవిస్తోంది ఏంటి’ అని సౌందర్య నిలదియ్యడంతో.. ‘అది చేసిన తప్పుకు పడిన శిక్ష.. ఇది చెయ్యని నేరానికి శిక్ష..’ అంటాడు కార్తీక్.

ఎదుటివాళ్ళు ఎం చెబుతున్నారో వినే అవకాశం ఇవ్వాలి కదా అని దీప అనగానే కార్తీక్ ఇవ్వను అంటూ తెగేసి చెబుతాడు. ‘ఎందుకు’ అంటుంది సౌందర్య. ‘ఇది రాయబడిన స్క్రిప్ట్.. మీరు ఇద్దరూ కలిసి రాసుకున్న కథనం.. అది నాకు తెలుసు..’ అంటాడు కార్తీక్. ‘ఏం తెలుసు డాక్టర్ బాబు మీకు.. మీకు చాలా తెలుసని మీ గురించి మీరు చాలా అనుకుంటున్నారు.. కానీ మీకు ఏం తెలియదని.. కనీసం ఎదుటివాళ్లని పూర్తిగా అంచనా వెయ్యలేరని ఇవాళే నాకు పూర్తిగా తెలిసింది. అన్నీ తెలుసు అని గిరిగీసుకుని బతుకుతూ ఉంటారే.. ఒక్కసారి ఆ గిరి నుంచి బయటికి వచ్చి చెప్పేది వింటే అని చెబుతుంటే దీప ని మళ్ళీ కార్తీక్ అడ్డుకుంటాడు.

నన్ను నేను రుజువు చేసుకోవడానికి దొరికిన ఒకే ఒక్క సాక్ష్యం గురించి చెబుతాను’ అంటుంది దీప. నిన్ను రుజువు చెయ్యడానికి నేనే కదా సాక్ష్యం..’ అంటాడు కార్తీక్. ‘అలా అనుకుంటూనే నన్ను బలిపశువుని చేశారు?’ అంటుంది దీప. అంటే ఎవరు చెప్పినా మీరు వినరా?’ అంటుంది దీప బాధగా. ‘చెప్పడానికి తులసి ఉంటే కదా?’ అంటాడు కార్తీక్. సౌందర్య, దీపలు షాక్ అవుతారు.

‘మీరు అల్లుకొచ్చిన కథని నాచేత నమ్మించాలని చూశారు. తేల్చుకుందామని వెళ్తే తులసి ఇళ్లు ఖాళీ చేసి పారిపోయింది.. తను చేసిందే నిజమై ఉంటే నాకు ముఖం చాటేసి ఎందుకు పారిపోతుంది? నేను సులువుగా ఈ కల్పిత కథల్ని నమ్మేస్తాననే అనుకుంటున్నారా?’ అంటాడు కార్తీక్.

దీంతో ఆనందరావు కలుగజేసుకుని కోపంగా.. ‘నమ్మవురా.. నువ్వు ఎప్పటికీ నమ్మవు.. మేమొక మూర్ఖుడ్ని కన్నామని సరిపెట్టుకుంటున్నాం.. దీప కూడా ఒక బండరాయితో పెళ్లి అయ్యిందని గుండే రాయి చేసుకుని ఉంటోంది.. ఇద్దర్ని కన్నావ్.. ఆ ఇద్దరి భవిష్యత్ కోసమైనా నువ్వు మారాలని కోరుకుంటున్నాం రా.. దీపకి చీకట్లో చిరు దీపంలాగ ఒక ఆశ చిగురించింది.. అదేరా మా అందరికీ ధైర్యాన్నిచ్చింది.. ఆ ధైర్యంతో దీప నీతో మాట్లాడేవిధంగా ప్లాన్ చేశాం.. కానీ నీలో వినే శక్తి సన్నగిల్లింది.. మాలో ఆ ఆశ కూడా చచ్చిపోయింది..’ అంటాడు ఆనందరావు. ‘మరి ఏం చేసి ఉండాల్సింది నేను..? అంటూ తల్లిదండ్రులను దీపని ప్రశ్నిస్తున్న కార్తీక్ .. నెక్స్ట్ ఏ నిర్ణయం తీసుకుంది దీప అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే..

Also Read:

రూ. 500కే కొత్త ఎల్ఈడీ టీవీ టీవీ.. ఆరా తీస్తే దిమ్మ తిరిగే షాక్‌.. పోలీసులే కంగుతిన్నారు

సెక్స్‌ స్కాండల్‌లో ఇరుక్కున్న మంత్రి, ప్రకంపనలు పుట్టిస్తోన్న రాసలీలల వీడియో