AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR: ఇటలీ నుంచి కొత్త కారును దిగుమతి చేసుకుంటున్న ఎన్టీఆర్‌.? ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

NTR Buys 5 Crore Worth Car: ఖరీదైన కార్లను కలెక్ట్‌ చేయడం సెలబ్రిటీలకు ఒక హాబీగా ఉంటుంది. ఇందుకోసం రూ. కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు చాలా మంది హీరోలు, క్రికెటర్లు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ..

NTR: ఇటలీ నుంచి కొత్త కారును దిగుమతి చేసుకుంటున్న ఎన్టీఆర్‌.? ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Narender Vaitla
|

Updated on: Mar 03, 2021 | 9:03 AM

Share

NTR Buys 5 Crore Worth Car: ఖరీదైన కార్లను కలెక్ట్‌ చేయడం సెలబ్రిటీలకు ఒక హాబీగా ఉంటుంది. ఇందుకోసం రూ. కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు చాలా మంది హీరోలు, క్రికెటర్లు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ వాహనాలపై తమకున్న మక్కువను ప్రపంచానికి చాటుచెబుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కార్లపై ఎక్కువగా మక్కువ చూపే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజాగా తన కార్ల కలెక్షన్లలో మరో కాస్లీ కారును చేర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ఏకంగా రూ.5 కోట్ల విలువ చేసే కారును బుక్‌ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ కారు ఇండియాలో తయారైంది కాదు ఇటలీలో. ఎన్టీఆర్‌ కోసం ఈ కారు ఇటలీ నుంచి ప్రత్యేకంగా భారత్‌కు రానుందన్నమాట. లాంబోర్గిని కంపెనీకి చెందిన ‘ఉరుస్‌’ కారును ఎన్టీఆర్‌ ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశాడని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ కారు భారత్‌ చేరుకోనున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా లాంబోర్గిని కారుకు ఎంతో క్రేజ్‌ ఉంది. అత్యంత కాస్లీ, లగ్జరీ కార్ల వరుసలో లాంబోర్గి మొదటి వరుసలో ఉంటుంది. ఇదిలా ఉంటే సౌత్‌ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఈ కారును బుక్‌ చేసుకున్న తొలి నటుడిగా ఎన్టీఆర్‌ చరిత్ర సృష్టించనున్నాడు. ఇక ఈ కారు ప్రత్యేకతల విషయానికొస్తే.. ట్విన్‌ టర్బో V8 ఇంజిన్‌తో ఉండే ఈ కారు 650 CV ప్రొడ్యుస్‌ చేస్తుంది. కేవలం 3.6 సెకండ్లలో 62 గంటకు 62 కీలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ కారు ప్రత్యేకత. ఇక ఎన్టీర్‌ సినీ కెరీర్‌ విషయానికొస్తే.. జూనియర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి ఓ సినిమా చేయనున్నాడు.

Also Read: Drishyam 2 movie : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా విక్టరీ హీరో.. ‘దృశ్యం 2’ కి కొబ్బరికాయ కొట్టిన వెంకీమామ..

athi Ratnalu movie : పాన్ ఇండియా స్టార్ చేతులమీదుగా విడుదల కానున్న జాతిరత్నాలు ట్రైలర్..

Keerthy Suresh : టాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో తక్కువ టైంలో టాప్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దూసుకుపోతున్న మహానటి.

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..